పెరుగుతున్న ధరల దృష్ట్యా కూలి పెంచాలి
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
సంస్థాన్ నారాయణపూర్, జూన్ 7: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీల రేట్లను పెంచాలని కార్మికులకు పీఎఫ్ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం నారాయణపురం మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపి సమ్మెలో పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘంలోని నిధులను కూడ ఇతర పథకాలకు మళ్లించడం బాధాకరమని కార్మికుల హక్కులను సాధించేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగొని గాలయ్య, మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, ఎఐటియుసి మండల అధ్యక్షులు దుబ్బాక సంజీవ, పల్లె గోపాల్ రెడ్డి, జనగాం శంకరయ్య వివిధ గ్రామాల కార్మికులు పాల్గొన్నారు.






