నేపాల్‌లో మృత్యు ఘోష.. పెరుగుతున్న మృతులు..?
01-09-2026 10:33 AM
నేపాల్: నేపాల్‌లో భారీ వరదలు, కొండచరియల విరిగిపడటంతో మృతుల సంఖ్య 939కి చేరింది. మరో 4,500 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారిలో 33 దేశాలకు చెందిన పర్యాటకులు ఉండగా, సుమారు 300 మంది భారతీయ పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.






