25 March, 2026 | 8:22 PM

మార్చి 28న వైద్యుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహణ

25-03-2026 06:49 PM

 జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శ్రీధర్

పెద్దపల్లి,(విజయక్రాంతి): మార్చి 28న శనివారం రోజున ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని, ఆసక్తి అర్హత గల అభ్యర్థులు హాజరుకావాలని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ బుధవారం  ఒక ప్రకటనలో తెలిపారు. 

పెద్దపల్లి జిల్లాలో గల తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న గైనకాలజీ, ఆప్తామాలజిస్ట్, రేడియాలజీ, ఆర్తోపెడిషియన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (ఎంబిబిఎస్) పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు మార్చి 28న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల వైద్యులు తమ దరఖాస్తు బయోడేటాతో పాటు అన్ని విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ ప్రతులు ఒక సెట్ తో హాజరు కావాలని, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులకు నెలకు లక్ష రూపాయలు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నెలకు 52,351 రూపాయల వేతనం ఉంటుందని, ఇతర వివరాలకు 8499061999, 9492457809 నెంబర్ నందు సంప్రదించాలని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.