25 March, 2026 | 8:07 PM

గ్రామాల అభివృద్ధే ధ్యేయం: సర్పంచ్ సునీత

25-03-2026 06:51 PM

వాంకిడి,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధే తమ ముఖ్య లక్ష్యమని కమాన గ్రామ సర్పంచ్ సునీత పేర్కొన్నారు. బుధవారం వాంకిడి మండలం కమాన గ్రామపంచాయతీ పరిధిలోని పూనాగూడా నుండి బోడం కప్పి వరకు ఉపాధి హామీ పథకం కింద రూ.3.50 లక్షల నిధులతో మంజూరైన రోడ్డు నిర్మాణ పనులను ఉప సర్పంచ్ లాహుకుమార్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం చేయ డం, ప్రజలకు మెరుగైన రవా ణా సౌకర్యాలు కల్పించడం తమ లక్ష్యమని తెలిపారు.

రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్‌కు తరలించుకునే విధంగా ఈ రహదారి ఉప యోగపడుతుందని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఉప సర్పంచ్ లాహు కుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరుగుతుండటంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నా యని తెలిపారు.గ్రామస్తులు ఈ పనులపై హర్షం వ్యక్తం చేస్తూ, రహదారి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబా టులోకి తేవాలని కోరారు.