అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభల గోడ ప్రతుల ఆవిష్కరణ
దమ్మపేట,(విజయక్రాంతి): మే 11,12,13 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు పట్టణంలో జరగబోయే-అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మసభలకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని గండుగులపల్లి గ్రామం లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో AIUKS జాతీయ మహాసభల గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము మాట్లాడుతూ... అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) జాతీయ మహాసభలు మే,11,12, 13తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు పట్టణంలో 300 మంది ప్రతినిధులతో జరుగుతుందని తెలిపారు.
ఇందులో 16 రాష్ట్రాల నుండి 300 మంది ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. మొదటి రోజు వేలాది మందితో భారీ ప్రదర్శన ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తారని, 12,13 తేదీల్లో ప్రతినిధుల సభ ఉంటుందని తెలిపారు. ఈ బహిరంగ సభకు ముఖ్య వక్తలుగా AIUKS జాతీయ నాయకులు ప్రదిప్ సింగ్ ఠాగూర్, వక్తలుగా AIUKS జాతీయ కన్వీనర్ కెచ్చెల రంగారెడ్డి, ఇల్లందు మాజి ఎమ్మెల్యే, గుమ్మడి నర్సయ్య, AIUKS అల్ ఇండియా ఆర్గనైజింగ్ కన్వీనర్ విమల్ త్రివేది, మాస్ లైన్ పార్టి రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, AIUKS కన్వినర్ కృష్ణ గోగోయి, మాస్ లైన్ పార్టి రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యురాలు కే.రమ తదితర ముఖ్య నేతలు హాజరవుతారని తెలిపారు.
ఈనాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి ఎన్నో గొప్పలు చెబుతున్నప్పటికీ, అందుకు అవసరమైన నిధులు కేటాయించే పరిస్థితిలో లేవని మండిపడ్డారు. భారత దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉందని అన్నారు. దేశానికి తిండి, బట్ట అందిస్తున్న రైతన్నలు న్యాయమైన గిట్టుబాటు ధరలు పొందలేక ఆర్థికంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు గల కారణాలు మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలెే కారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుర్సం ముత్యాలరావు, బండి ఆదినారాయణ, కిసరి వెంకటేష్, బొంత కుమార్ కిసరి అర్జున్, మండవ రాఘవేందర్,తదితరులు పాల్గొన్నారు.






