పోటీపడి చదవండి.. ఉన్నతులుగా ఎదగండి.. మత్తుకు బానిస కాకండి
27-04-2026 05:08 PM
బోథ్,(విజయకాంతి): నిరుద్యోగ యువత కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉందని ఎంపీడీవో రమేష్ పేర్కొన్నారు. యువకులు ఒకసారి ఉద్యోగం రాకపోతే నిరాశ చెందవద్దని మరింత కసితో చదవాలని అప్పుడే ఏదైనా అనుకున్న సాధిస్తామన్నారు. సోమవారం మండలంలోని కౌటబి గ్రామంలో నిరుద్యోగ యువతకు సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏఎస్ఐ సురేందర్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. యువత లక్ష్యం ఎంచుకొని లక్ష సాధన దిశగా నిరంతరం శ్రమించాలని ఆయన కోరారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తే మూడు తరాలు మారిపోతాయి అన్నారు. తాను పుట్టి పెరిగిన గ్రామానికి చేయాలను దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక సైబర్ నేరాలపై అవగాహన కలిగించారు.






