9 April, 2026 | 12:55 PM

కమిషన్లకు అలవాటై... రిజర్వాయర్ల పేరుతో రాద్ధాంతం

09-04-2026 11:29 AM

ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి, (విజయక్రాంతి): గొల్లపల్లి రిజర్వాయర్ కావాలని జీవో నెంబర్ 105 తీసుకువచ్చింది ఎవరనీ జూన్ 10 2015 బి ఆర్ ఎస్ పార్టీ వచ్చిన తర్వాత జీవోను  తీసుకువచ్చిన నాయకులు నిండు రిజర్వాయర్లు పేరు రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి లో ఒక భాగమైంది ఏదుల రిజర్వాయర్ 2800 ఎకరాలలో రిజర్వాయర్ నిర్మాణం అయిందనీ ఆయన పేర్కొన్నారు. ఏదుల రిజర్వాయర్ వనపర్తి నియోజకవర్గంలో నిర్మాణం అయిందే తప్ప దాని నుంచి  వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందే పరిస్థితి లేదన్నారు. ముందు దీనికి సమాధానం చెప్పి తప్పు చేసినమని వనపర్తి అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలని ఎమ్మెల్యే  విమర్శించారు.

ఒక్క ఎకరానికి నీళ్లు తీసుకోవచ్చు అని అబద్ధపు మాటలు చెప్పడం ఎంతవరకు సమంజసం కాదన్నారు. నీళ్లు తీసుకునేందుకే రెగ్యులేటర్ ఏర్పాటు చేశామని చెప్పే నాయకులు  రెగ్యులేటర్ దాని కింద ఉన్న బుద్ధారం  రిజర్వాయర్ లో ఎత్తు ఎంత అని ఆయన ప్రశ్నించారు. రెగ్యులేటర్ ఏర్పాటు చేసిన వ్యక్తులు రిజర్వాయర్ ద్వారా ఇంత ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని అలైట్మెంట్ ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం లేనప్పుడు 2015వ సంవత్సరంలో ఏదుల రిజర్వాయర్ నిర్మాణం తర్వాత 2016లో జీవో తీసుకువచ్చింది మీరు కాదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అందుకు సంబంధించి ఆర్ వి అసోసియేషన్ వారి ద్వారా డ్రోన్ సర్వేలు నిర్వహించింది నిజం కాదా అని, సర్వేకు డబ్బులు సరిపోడం లేదని అంటే మరో నాలుగు కోట్లు సర్వే కేటాయించిన మీరు కాదా అని ఆయన అన్నారు. కె ఎల్ ఐ కి సంబంధించి 4 లక్షల 20వేల ఆయకట్టు ఉంటుందని, ఇందులో జొన్నలబొగడ, ఎల్లూరు, గుడిపల్లి ఉంటాయని ఈ మూడు రిజర్వాయర్ల కలిపి మూడు టీఎంసీల నీరు కూడా లేదని ఇందుకు సంబంధించి లైవ్ రిజర్వాయర్లు కావాలని 90 రోజుల్లో నీటిని ఎత్తిపోసుకుని స్టాక్ చేసుకునేందుకు మరో 40 రిజర్వాయర్లు 16 టీఎంసీ కావాలని అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన విషయం మర్చిపోసి మాట్లాడుతున్నారని ఆయన గుర్తుకు చేశారు.

ఈ రిజర్వార్లకు సంబంధించి  రూ. 4250 కోట్లు అవుతాయని సర్వే సంస్థ వెల్లడించడంతో అప్పటి ప్రభుత్వ ఆర్థిక తక్కువ బడ్జెట్ తో ఎక్కువ నీటి సామర్థ్యం గల రిజర్వాయర్లు మాత్రమే గుర్తించండి అని చెప్పడంతో మార్చి 07, 2019 రోజున అంతొద్దు 20 రిజర్వాయర్లను మాత్రమే కన్సిడర్ చేయండి 2,460 కోట్లు అవుతాయి వాటిని అప్రూవల్ చేయండి అని అప్పటి ముఖ్యమంత్రి చెప్పడంతో అధికారులు అధికారికంగా అప్లోడ్ చేసి ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ 20 రిజర్వాయర్లలో వనపర్తికి సంబంధించి గొల్లపల్లి రిజర్వాయర్ గోపాల్పేట, ఖిల్లా ఘణపురం రిజర్వాయర్, బుద్ధారం రిజర్వాయర్, బుద్ధారం స్టేజ్ 2  రిజర్వాయర్ , గట్లఖానాపురం రిజర్వాయర్, ఈ 6 రిజర్వాయర్లలో ఆరు నుంచి ఎనిమిది టిఎంసిల నీటి నిల్వ ఉంటుందని పేర్కొన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రతీది చేసింది ఆనాటి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులేనని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదని అప్పుడున్న ప్రాజెక్టులనే ప్రస్తుతం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులపైనే తాను అసెంబ్లీలో మాట్లాడానని అట్ల మాట్లాడిన దానికి ఇక్కడున్న కొంతమంది గత పాలకులు వారి చెంచాలతో రిజర్వాయర్లు వద్దంటూ దొంగ దీక్షలు చేయించడం విడ్డూరమని ఎమ్మెల్యే చెప్పారు. ప్రభుత్వానికి ఎలాంటి వినతులు ఇవ్వకుండానే అనవసరమైన ధర్నాలు చేయడం సమంజసం కాదన్నారు. 

ఇన్ని జీవోలు ఇచ్చింది అప్పుడున్న ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు అని, వారి హయాంలో చేపట్టిన రిజర్వాయర్ల నిర్మాణంలో భూములు కోల్పోయిన కొంతమంది నష్ట పరిహారాలు ఇవ్వకుండా నాన్న ఇబ్బందులకు గురి చేసిన మీరు నేను నీతులు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. తొమ్మిదినర సంవత్సరాలలో అభివృద్ధి పేరు మీద వనపర్తి నియోజకవర్గంను ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. వనపర్తి నియోజకవర్గం పునర్వ్యవస్థీకరణలో అప్పటి రాజుగారు నిర్మించిన రిజర్వాయర్లన్నీ డౌన్ స్టీమ్ లోకి వెళ్లిపోయాయని కేవలం బుద్ధారం, బుద్ధారం స్టేజ్ టు, పోల్కే పహాడ్, గొల్లపల్లి రిజర్వాయర్ల నుంచి మాత్రమే వనపర్తి నియోజకవర్గానికి సాగునీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఈ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని నేటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారికి విన్నవించి ఉన్నామని త్వరలోనే నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ మల్లు రవి , ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు  తదితరులు పాల్గొన్నారు.