26 March, 2026 | 2:50 AM

అసెంబ్లీలో ‘ఇప్ప సారా’ రచ్చ

26-03-2026 12:00 AM

కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం 

ఇప్పసారా కంపెనీకి ఇందిరమ్మ పేరు పెట్టొద్దన్న బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి 

రాకేష్‌రెడ్డిపై మంత్రుల ఆగ్రహం 

క్షమాపణలు చెప్పాలని డిమాండ్ 

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): అసెంబ్లీలో ఇప్పపువ్వు సారా అం శంపైపై రచ్చ జరిగింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య పోటా పోటీ మాటల యుద్ధానికి దారి తీసింది. బుధవారం బడ్జెట్  పద్దులపై చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలంగాణలో ఇప్పపువ్వు సారాను తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పపువ్వు సారా అంశం ప్రభుత్వా నికి నవ్వులాటగా ఉన్నదని, ఆ సారా ఉత్పత్తితో 130 దేశాల్లో లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అనిరుధ్‌రెడ్డి ప్రసంగానికి మద్దతుగా నిలిచారు.

ఒకవేళ ప్రభుత్వం ఇప్ప సారా తాయారు చేస్తే ఆ కంపెనీకి ‘ఇందిరమ్మ’ పేరు మాత్రం పెట్టొద్దని వ్యాఖ్యా నించారు. ప్రధానిగా సేవలందించిన ఇం దిరాగాంధీని కించపర్చే విధంగా మా ట్లాడటం సరికాదని మంత్రులు శ్రీ ధర్‌బాబు, పొన్నం ప్ర భాకర్, సీతక్క, వా కిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం తమాషాగా ఉందా రాకేష్‌రెడ్డి’ అంటూ మంత్రి పొన్నం ప్ర భాకర్ మండిపడ్డా రు.

సభలో సారా అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇందిరమ్మ పేరు తీసినందుకు రాకేష్‌రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పపువ్వు సా రా అంశంలో ఇందిరమ్మ పేరు ఎత్తడం మ హిళా లోకాన్ని అవమానించడమేనని సీతక్క అన్నారు. రాకేష్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మంత్రి శ్రీధర్‌బాబు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటే హుందాతనంగా ఉం టుందని సూచించారు. బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్‌రావు మాట్లాడుతూ.. అ టు అధికార కాంగ్రెస్, ఇటు బీజేపీ కలిసి గంటపాటు సభా సమయాన్ని వృధా చేశారని విమర్శించారు. తెలంగాణ సాధించిన తమ నాయకుడు కేసీఆర్‌పైన ఇదే సభలో అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు సభా సంప్రదాయాలు తెలియవా..? అని నిలదీశారు.

సభ్యుడు తప్పుగా మాట్లాడి ఉంటే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. రాకేష్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని స్పీకర్ పదే పదే సూచించినా.. బీజేపీ వెనక్కి తగ్గలేదు. రాకేష్‌రెడ్డి మాటలను రికార్డుల నుంచి తొలగిం చా లని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పీకర్‌కు సూచించడంతో.. స్పీక ర్ స్థానంలో ఉన్న బాలునాయక్ రికార్డుల నుంచి తొలగించి వివాదానికి ముగిం పు ప లికారు. ఆ తర్వాత సభను ప్రారంభించారు.  

ఇప్ప సారాతో వందేళ్ల ఆయుష్షు: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి 

ఇప్ప చెట్టుకు 5 వేల ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్నదని, దాని ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని జడ్చర్ల ఎమ్మె ల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. ఇప్పపూల సారా తాగితే 100 ఏళ్లు బతుకుతారని తెలిపారు. ఇప్పు పువ్వు వినియోగం, దాని ద్వారా ఆదివాసి, గిరిజనులకు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో విక్రయిస్తున్న చీప్ లిక్కర్ వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుందని, 60 ఏళ్లు కూడా బతకలేని పరిస్థితి నెలకొందన్నారు.

తన నియోజకవర్గ పరిధిలో తండాల ప్రజలు గతంలో ఇప్పపూల సారా తాగి 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించారని ఆయన గుర్తు చేశారు. ఇప్ప పువ్వను టీలో కలిపి తీసుకోవడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని తెలిపారు. ఇప్ప పువ్వుతో కేవలం సారా మాత్రమే కాకుండా ఐస్‌క్రీమ్, కేక్స్, ఇప్ప లడ్డూలు, బిస్కెట్లు వంటి రకరకాల ఆహారా పదార్థాలను తయారు చేయ వచ్చని సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 1.6 లక్షల మంది ఇప్పపూల సేకరణ ద్వారా ఉపాధి పొందుతున్నారని, మధ్యప్రదేశ్‌లో  ‘మాండ్’ అనే డ్రింక్‌ను బాటిల్ రూ.800 చొప్పున విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారని వివరించారు.

అక్కడ ప్రభుత్వమే శిక్షణతో పాటు యంత్రాలను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని ఆదివా సీలు ఆర్థికంగా బలోపేతం సేందుకు ఇప్ప పువ్వు సారా తయారికి ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను దేశ విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందన్నా. 

ఇందిరాగాంధీని అవమానించలేదు: ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి 

ఇప్పపువ్వు సారా చర్చ సందర్భంగా తా ను మాట్లాడిన మాటలను ఎవరూ అపార్థం చేసుకోవద్దని ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి కోరారు. తాను ఇందిరాగాంధీని అవమానించలే దన్నారు. ఇప్పపువ్వు సారాను అందుబా టులోకి తీసుకొస్తే దానికి ఇందిరాగాంధీ పేరు పెట్టొద్దు అనడమే తప్పా.. పేరు పెట్టాలని చెప్పలేదు అన్నారు. తాను మాట్లాడిన మాటలు తప్పనిపిస్తే రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. కల్తీ కల్లు తాగినొల్లు పిచ్చొళ్లుగా మారడమే కాకుండా ఆస్తిపంజరాలుగా మారి మృతి చెందుతున్నారని రాకేష్‌రెడ్డి తెలిపారు.

ఇప్పపువ్వు సారాయి వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉండన్నారు. ఈ క్రమంలోనే బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి జోక్యం చేసుకొని.. రాకేష్‌రెడ్డి ఎక్కడా కూడా అసభ్యపదజాలం వాడలేదని స్పష్టం చేశారు, మంత్రులు అనవసరంగా ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాకేష్‌రెడ్డి మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ అంటే ఉక్కు మహిళా అని ఆమెంటే ఎంతోగౌవరమన్నారు. అంతే కాకుండా ఇందిరాగాంధీపై సోషల్ మీడియాపై తప్పుడు ప్రచారం చేసినప్పుడు తానే ఖండించానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు ఖండించలేదని ఎదురుదాడి చేశారు.