నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన సీపీ సాయి చైతన్య
పసుపు విక్రయదారులు రైతులతో వివరాలు తెలుసుకున్న సాయి చైతన్య
నిజామాబాద్, మార్చ్ 25 (విజయక్రాంతి): నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మార్కెట్ యార్డ్లో పసుపు (టర్మరిక్) విక్రయదారులతో నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, మాట్లాడారు. మార్కె ట్ యార్డులో పసుపు జోరే విషయమై విజయ క్రాంతి ప్రచురించిన వార్తలకు స్పందించిన సిపి మార్కెట్ యార్డ్ ను సందర్శించారు. రైతులు మార్కెట్కు తెచ్చే పసుపు పంట రక్షణ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ సెక్యూరిటీ కి పలు సూచనలు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
బుధవారం మార్కెట్ యార్డ్ లో వారికీ గల సదుపాయంల గురించి రైతులను క్షుణ్ణముగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్లో ఎలాంటి గొడవలు, వివాదాలు లేకుండా వ్యాపారం జరగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ శాంతిభద్రతలను కాపాడడానికి కృషి చేయాలని తెలిపారు. తప్పుడు తూకాలు , మధ్యవర్తుల మోసాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్ యార్డ్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలు తగ్గించే విధంగా సహకరించాలని కోరారు.
సెక్యూరిటీ సిబ్బంది అన్ని గేట్ల వద్ద 24/7 నిఘా ప్రతిష్ట పరచి , అనుమతి లేని వారిని ఎవరిని, అనుమతించకూడదని స్థానిక సిబ్బందికి దేశాలు ఇచ్చారు. భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అవసరమని సూచించారు. ఏదైనా అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రైతులను మార్కెట్ కమిటీ సిబ్బందిని కోరారు. సిపితోపాటు నిజామాబాద్ నగర టౌన్ 3 ఎస్. ఐ శ్రీ హరి, బాబు పసుపు రైతులు ఉన్నారు.




