15 March, 2026 | 8:30 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

అభివృద్ధికి కంకణ బద్ధుడినై పనిచేస్తా

08-02-2026 01:38 AM

8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి మూడవత్ బాలకోటి 

భూత్పూర్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): మున్సిపల్ పట్టణంలోని 8వ వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పక అమలు చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మూడవత్ బాలకోటి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఇంటింటికి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఐదేళ్లపాటు ప్రజలకు సేవకునిగా పని చేసేందుకు 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తానని, వార్డు ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని ఆయన కోరారు.

8వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా వారికి అండగా ఉంటానన్నారు. వార్డు పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. వార్డు అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటారన్నారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సహకారంతో నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపడుతానన్నారు.8వ వార్డులో నెలకొన్న సమస్యలను గెలిచిన వెంటనే  పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, వార్డులోని ప్రజలకు నిరంతరం మీ మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానని అందుకు ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.