9 June, 2026 | 6:23 PM

మంథనిలో రేపు 4, 5 వార్డుల వార్డు సభ

09-06-2026 05:21 PM

సమస్యల పరిష్కారానికి ప్రజలు హాజరుకావాలి

మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపాలిటీ పరిధిలోని 4 మరియు 5వ వార్డులకు సంబంధించిన వార్డు సభను  రేపు (జూన్ 10, బుధవారం) ఉదయం 9:30 గంటలకు కూచిరాజ్‌పల్లి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్ తెలిపారు. మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుందని, ఈ సభలో సంబంధిత వార్డుల ప్రజలు తమ ప్రాంతాల్లోని సమస్యలు, వినతులు, అభివృద్ధికి సంబంధించిన సూచనలను దరఖాస్తుల రూపంలో అధికారులకు అందజేయవచ్చని,

వార్డుల వివరాలు

 4వ వార్డు గంగాపురి (పార్ట్–1), లైన్ గడ్డ.

5వ వార్డు గొల్లగూడెం (పార్ట్–1), గంగాపురి (పార్ట్–2), కూచిరాజ్‌పల్లి, శ్రీరామ్‌నగర్.

వార్డుల సమగ్ర అభివృద్ధి కోసం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.