17 April, 2026 | 12:17 AM

రాష్ట్రమంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం..

14-06-2025 09:06 PM

కరీంనగర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి(Minister Gaddam Vivek Venkata Swamy)కి ప్రజామిత్ర ప్రోగ్రెసివ్  డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ ఆధ్వర్యంలో శనివారం బొమ్మకల్ బైపాస్ లో ఘన స్వాగతం పలికారు. నూతనంగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన ఎమ్మెల్యేగా ప్రతినిత్యం  వహిస్తున్న చెన్నూరు వెళ్లే క్రమంలో ఆయనకు శాలువా  కప్పి, పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది గడ్డం లక్ష్మణ్, డి ఈ జనార్ధన్, చిగిరి శ్రీధర్, బోయినపల్లి చంద్రయ్య, నల్లాల శ్రీనివాస్, గజ్జల రవీందర్, రిటైర్డ్ సిటిఓ లక్ష్మి రాజం, గాదం నరేందర్, తదితరులు పాల్గొన్నారు.