17 March, 2026 | 5:47 PM

అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న ఫెనిషింగ్ రాడ్లను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

14-06-2025 09:04 PM

ఘట్ కేసర్: పోచారం మున్సిపల్(Pocharam Municipal) యంనంపేట్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న ఫెనిషింగ్ రాడ్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కళ్ళజోడును తీసివేశారు. ఈ విషయమై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో స్థానిక బిజెపి సీనియర్ నాయకులు పత్తెపు పాండురాజు,  బిఆర్ఎస్ ఎస్సీ సెల్ మున్సిపల్ అధ్యక్షులు మీసాల రాజేష్  ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద  ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.