25 February, 2026 | 10:52 PM

బ్రిడ్జిపై హెచ్చరికల బోర్డు ఏర్పాటు

25-02-2026 05:31 PM

భైంసా,(విజయక్రాంతి): భైంసా పట్టణంలోని బస్ డిపో వద్ద బ్రిడ్జిపై ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ బుధవారం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఈ బోర్డులను స్వయంగా ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజేష్ మీనా సాయికిరణ్ పట్టణ సిఐలు సిబ్బంది ఉన్నారు.