18 July, 2026 | 12:39 AM

మూడో వన్డేకు వాషింగ్టన్ సుందర్ దూరం

18-07-2026 12:39 AM

లండన్, జూలై 17: మూడు వన్డేల సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్‌కు ముందు టీ మిండియాకు షాక్ తగిలింది. ఆదివారం లార్డ్స్‌లో జరగనున్న మూడో, చివరి వన్డేకు స్టార్ ఆల్‌రౌండర్ వా షింగ్టన్ సుందర్ గాయం కారణంగా దూరమయ్యాడు. రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తుం డగా వాషింగ్టన్ సుందర్ కాలికి తీవ్ర గాయమైంది.

ఈ గాయం కారణంగా భారత బౌలింగ్ సమయంలో ఫీల్డింగ్ కూడా చేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో 5 బంతుల్లో కేవ లం 2 పరుగులు మాత్రమే చేసినా, మ్యాచ్ సమయంలో నొప్పితో కనిపించాడు. ఇన్నిం గ్స్ విరామ సమయంలో జట్టు ఫిజియో తొడకు బ్యాండేజ్ కడుతూ కనిపించాడు. సుందర్ ఔటైన తర్వాత తీవ్రమైన అసౌకర్యంతో స్టేడియం నుంచి బయటకు నడిచాడు. జట్టులోని ఇతర ఆల్రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా ఇప్పటికే గాయపడ్డారు.