గోదావరికి జలకళ
భద్రాచలం వద్ద 13.8 అడుగుల ప్రవాహం
భద్రాచలం, జూలై 6 (విజయక్రాంతి): భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం సోమవారం క్రమంగా పెరిగింది. ఇసుక ఎడారిని తలపించిన గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా సోమవా రం సాయంత్రం ఏడు గంటలకు 13.8 అడుగుల వద్దకు చేరుకొని పరవళ్లు తొక్కుతుంది.
ప్రస్తు త పరిస్థితులను బట్టి చూస్తే, రాగల కొన్ని గంటల పాటు నది ప్రవాహంలో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చని, వరద ఉధృతి కొంతకాలం పాటు స్తబ్దతగా (యథాతథంగా) కొనసాగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన వర్షపాతం తగ్గడంతోనే ఈ పరిస్థితి నెలకొందని, అయితే నదీ పరివాహక ప్రాంత ప్రజలు ప్రవాహ సరళిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భద్రాచలం వద్ద వరద పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.






