7 July, 2026 | 12:59 AM

పశు వైద్యం.. అంతులేని నిర్లక్ష్యం

07-07-2026 12:22 AM
  1. సిబ్బంది కొరత... ఉన్న వారి నిర్లిప్తత
  2. ప్రైవేటు పైపు రైతుల చూపు... ఆర్థిక భారం

ఖానాపూర్, జూలై 6 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ సబ్ డివిజన్ పరిధిలో పశు వైద్యం లో అంతులేని నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నిర్మల్ జిల్లాలోనే ఖానాపూర్ సబ్ డివిజన్ పరిధిలో ప శుసంపద ఆవులు, ఎద్దులు, బర్రెలు, గొర్రె లు, మేకలు, కోళ్ల ఫారాలు, కుక్కల పెంపకం, విరివిగా ఉంటుంది .ఈ నేపథ్యంలో ప్రభు త్వం పైపు నుంచి పశువైద్యంపై నిర్లక్ష్యం తో పశు సంపద కుదేలవుతుంది. పశువులకు వై ద్యం అందించడంలో వైద్య సిబ్బంది విఫలమవడంతో రైతులు ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

దీం తో రైతుపై అధికంగా ఆర్థిక భారం పడుతుందని వాపోతున్నారు .గత నాలుగు సంవత్స రాలుగా ఖానాపూర్ నియోజకవర్గం పెంబి, కడం, దస్తురాబాద్, మండలాల్లో పశు వైద్య శిబిరాలు అసలు లేవు అనే చెప్పవచ్చు. ఎవరైనా పశు పోషకులు తమ సమస్య గురించి సిబ్బందికి సమాచారం ఇస్తే తప్ప వైద్యం అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మండలంలో ఖానాపూర్, పెంబి, సత్తెనపల్లి ,బీర్నంది, కడెం, దస్తురాబాద్, లలో పశు వైద్య ఆసుపత్రులు ఉన్నప్పటికీ అక్కడ వైద్య సి బ్బంది లేకపోవడంతో భవనాలు దశాబ్దాల క్రితమే శిథి లావస్థకు చేరుకున్నాయి.వీటి నూతన భవనాల కోసం పట్టించుకున్న నాథుడు లేడు.కాగా ఖానా పూర్ ,బీర్నంది సత్తెనపల్లి గ్రామాల్లో భవనాలు పూర్తిగా శిథిలమైపోయినప్పటికీ, ఖా నాపూర్ లో ఐదేళ్ల క్రితం ఒక నూతన భవ నం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించింది.

ఈ భవనం నిర్మాణం ఏళ్ల తరబడి కొనసాగుతుండడంతో పశువైద్య ఆసుపత్రి స్థాని క మార్కెట్ యార్డు వద్ద అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. భవనం నిర్మాణం ఆలస్యానికి కారణం కాంట్రాక్టర్ ను పర్సంటేజీలకోసం వేదించట మే కారణం అని అనేక ఆరోపణలు ప్రచారం లో వున్నాయి. కాగా బీర్ నంది, సత్తెనపల్లి గ్రా మాల్లో భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో రైతులు తమ పశు వులను ఎక్కడికి తీసుకు వెళ్లాలో తెలియక పశుసంపద మ్రుత్యువాత పడి నష్టపోతున్నారు.

ఇదే క్రమంలో కొంతమంది పశు వైద్యం నేర్చుకున్న వారు రైతుల వద్ద తమ చేతివాటం చూపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అన్న ఆరోపణలు వినవస్తున్నాయి. మొన్నటి వరకు ఖానాపూర్ లో ఒక పశువైద్య సంచాలక అధికారి ఉండగా అతను వారం క్రితం జగిత్యాల జిల్లాకు బదిలీపై వెళ్లారు. అధికారి ఉన్నప్పుడు కూడా వైద్యం పై శ్రద్ధ ఉండేది కాదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖానాపూర్ ఇన్చార్జి బాధ్యతలతో నడుస్తుండగా వర్షాకాలం మొదలైనప్పటికీ ఇప్పటికీ ఏ మండలంలో కూడా పశువైద్య శిబిరం నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

కాగా ఆసుపత్రుల్లో సబార్డినేట్ ఉద్యోగులు తప్ప వైద్యులు కనిపించకపోవడంతో రైతులు తమ పశువుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు. కొంతమంది మాత్రం ప్రైవేటు వెటర్నరీ మెడికల్స్ ని ఆశ్రయించి తమ పశుసంపదను కాపాడుకుంటున్నారని వినికిడి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు స్పందించి పశు వైద్యంపై శ్రద్ధ చూపెడితే ఆర్థికంగా రైతులు బలపడే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి క్షేత్రస్థాయిలో గోపాలమిత్ర వంటి సిబ్బంది ప్రాథమిక వైద్యం అందించాల్సి ఉండగా అలాంటి సిబ్బంది ఇక్కడ కొరతగా ఉందని పలువురు అంటున్నారు. ఇకనైనా వర్షాల నేపథ్యంలో పశువులను రోగాల బారిన పడకుండా వైద్యం అందించి ఆదుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయమై స్థానిక ఏ డి ఏ రామకృష్ణుడిని విజయ క్రాంతి వివరణ కోరగా తాను వారం క్రితమే బదిలీ అయ్యానని, రిలీవ్ కూడా అయ్యానని తెలుపడం విశేషం.