7 July, 2026 | 1:22 AM

అయోమయం ‘సర్’!

07-07-2026 12:45 AM
  1. ఓటు నమోదుపై ప్రజల్లో గందరగోళం దరఖాస్తులు పూర్తిచేసే బాధ్యత ఎవరిది?
  2. మ్యాపింగ్లలో కనిపించని అనేకమంది ఓట్లు ముఖం చాటేస్తున్న రాజకీయ పార్టీల ఏజెంట్లు

ఎర్రుపాలెం జులై 6 ( విజయ క్రాంతి): సర్ పై ఓటర్లు అయోమయానికి గందరగోళానికి గురవుతున్నారు... సర్ ప్రక్రియలో మా ఓటు ఉంటుందా ఉండదా... అనేక అనుమానాలను ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు. బి ఎల్ వో లు ఇచ్చిన దరఖాస్తు ఫాములను నింపే బాధ్యతను ఎవరు తీసుకుంటారని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.. ఓటరు నమోదు సవరణ ప్రక్రియ (సర్) గ్రామాలలో పట్టణ కేంద్రాలలో నిర్లిప్తంగా కొనసాగుతుంది.

ఈ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కు సంబంధించి బూత్ స్థాయిలలో అనేకమంది ఓటర్ల వివరాలు జత కుదరకపోవడంతో బూతు పూర్తిస్థాయి ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లకు దరఖాస్తులు పంపిణీ చేసే సమయంలో కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి తలెత్తింది. కాగా మ్యాపింగ్ చేసిన ఓటర్లకు సంబంధించి దరఖాస్తులను పంపిణీ చేసే ప్రక్రియ పూర్తి చేయగా వాటిని నింపి తిరిగి సేకరించే క్రమం కు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని ప్రతి ఇంటికి వెళ్లి దరఖాస్తులను పూర్తి చేసి లేదా చేయించి సేకరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం తెలిసింది.

అయితే గ్రామస్థాయిలో బిఎల్‌ఓ లు కొంతమంది దరఖాస్తు ఫారాలను సంబంధిత ఓటర్లు మాత్రమే పూర్తి చేయాలని తాము చేయాల్సిన బాధ్యత తమకు నిర్దేశించలేదని స్పష్టం చేస్తున్నారని సమాచారం. గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుత సర్ ప్రక్రియపై విద్యావంతుల లోనే అనేకమందికి పలు సందేహాలు కొనసాగుతున్న క్రమంలో గ్రామాలలో 2002 జాబితాలోని వారి ఓటర్ల వివరాలను పూర్తి చేసి నేను నీతో గడువులు అందించాలన్న ఆలోచన అనేక మందిలో లేకపోవడం క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది.

ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో ఉప సర్పంచ్ శీలం రామిరెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది విద్యార్థులను యువకులను దరఖాస్తులను పూర్తిచేసే పనికి వాలంటీర్లుగా నియమించడంతో పాటు గ్రామంలో మైక్ ప్రచారం ఏర్పాటు చేయడం ద్వారా అనేకమంది గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకొని తమ ఓటర్ల దరఖాస్తు ఫారాలను నింపుకుంటూ బిఎల్‌ఓ లకు అప్పగించడం కనిపించింది.

ఈ విషయమై విచారణ చేయగా అక్కడ ఉన్న బిఎల్వోలు తమకు దరఖాస్తులు పూర్తి చేయాల్సిన బాధ్యతను నిర్దేశించలేదని పేర్కొనడం గమనార్హం. ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు అందించిన దరఖాస్తులను పూర్తి ఆధారాలతో నింపి సేకరించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని విన్నవించినప్పటికీ అలాంటిదేమీ లేదని తమకు దరఖాస్తు ఫారాలు ఇస్తే తీసుకుంటామని పేర్కొన్నట్లు ప్రజాప్రతినిధులు తెలపడం గమనించాల్సిన అవసరం.

ఇలాంటి పరిస్థితులే అనేక గ్రామాలలో కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ప్రతి బూత్ స్థాయిలో రాజకీయ పార్టీల ఏజెంట్లు దరఖాస్తు ఫారాలను పూర్తిచేసే బాధ్యతలను చేపడతామని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో 60శాతం కు పైగా ఆచరణలో లేకపోవడంతో సర్ ప్రక్రియ నిర్మాణాత్మకమైన వివరాల నమోదులో కొంత సందిగ్ధత నిర్లిప్తత కొనసాగుతున్నదని చెప్పవచ్చు. అయితే ఈనెల 25 వరకు దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉండడంతో ఇప్పటికైనా నూరు శాతం ఓటర్ల నమోదు మ్యాపింగ్ దరఖాస్తుల సేకరణ ఆన్లైన్ ప్రక్రియ లను నిషితంగా పరిశీలించి నిర్వహించాల్సిన అవసరం బాధ్యత బి ఎల్ వో లు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

అలాగే అధికారులు కూడా గ్రామాలలో జరుగుతున్న ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని నిధులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు అనేకమంది పట్టించుకోవడం లేదన్న వాదన కూడా ప్రజల నుండి వస్తున్న క్రమంలో పార్టీలు కూడా వారు నియమించిన ఏజెంట్లను తప్పనిసరిగా బిఎల్‌ఓ లతో కలిసి ఈ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.