22 April, 2026 | 3:20 PM

కొనసాగుతున్న ఇంకుడు గుంతల సర్వే

10-05-2024 12:17 AM

దాదాపు 30వేలకు పైగా వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకున్నారు

జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (విజయక్రాంతి): నగరంలో వాటర్ ట్యాంకర్ల డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తమ శాఖ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మా ణం కోసం చేస్తున్న సర్వే కొనసాగుతుందని జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఇంకుడు గుంతల సర్వేపై జలమండలి ప్రధా న కార్యాలయంలో గురువారం ఆయన సమీక్షించారు. నగరంలో దాదాపు 30వేల కు పైగా వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకున్నారని తెలిపారు. బుకింగ్ చేసుకున్న వారు నివాసం ఉండే ప్రాంతాల్లో భూగర్భ జలా లు అడుగంటిపోవడమే దీనికి కారణమని చెప్పారు. ఆ ప్రాంతాల్లో నీటి సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు ఇంకుడు గుంతలను నిర్మించాలని పలు స్వచ్ఛంద సంస్థలతో జలమండలి సర్వే చేపట్టిందని తెలిపారు. 2500లకు పైగా ఇండ్లలో ఇంకు డు గుంతల నిర్మాణంపై సర్వే చేసి, ఇంకుడు గుంతల అవసరంపై అవగాహన కల్పించా రు. సర్వే వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేసినట్లు చెప్పారు. ఈ సమీక్షలో రెడెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, ప్రత్యేకాధికారి జాల సత్యనారాయణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫిల్లింగ్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీ

వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లలో జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఎల్లారెడ్డిగూడ, వెంగళ్‌రావునగర్, ఎస్‌ఆర్ నగర్, వెంకటగిరినగర్, తట్టిఖానలోని ఫిల్లిం గ్ స్టేషన్లను ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్యాంకర్ల డెలివరీలో పెండింగ్ లేకుండా చూడాలని, సరిపడా సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించారు. ట్యాంకర్ డెలివరికి సంబంధించిన ఇన్, ఔట్ లాగ్‌బుక్స్‌లో తప్పనిసరిగా టైమింగ్ నమోదు చేయాలని, ఫిల్లింగ్ స్టేషన్లలోని సీసీ కెమెరాలు పని చేస్తున్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు.