22 April, 2026 | 4:41 PM

రెండు ఖమ్మం.. మూడు మానుకోట!

10-05-2024 12:20 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విచిత్రం

ఇద్దరు ఎంపీలను ఎన్నుకోనున్న ఒక్క జిల్లా వాసులు

ప్రస్తుతం రెండూ బీఆర్‌ఎస్ ఎంపీలే ప్రాతినిధ్యం

ఈ సారి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే పోటీ

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి) మే 9: ఒక్క జిల్లాలో ఇద్దరు, ముగ్గురు ఎంపీలను ఎన్నుకోవడం విన్నాం.. కానీ, ఇక్కడ ఒక్క జిల్లానే రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో వేర్వేరుగా ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండు పార్లమెంట్  నియోజకవర్గాల స్థానాల పరిధిలో ఉంది. కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల ఓటర్లు ఖమ్మం ఎంపీని ఎన్నుకోనుండగా, పినపాక, ఇల్లెం ద, భద్రాచలం నియోజవర్గాల ఓటర్లు మహబూబాబాద్ ఎంపీని ఎన్నుకోనున్నారు.  వీటిలో ఒకటి జనరల్  స్థానం కాగా, మహబూబాబాద్ ఎస్టీ రిజర్వేషన్ స్థానం. రెండూ బీఆర్‌ఎస్ సారథ్యంలోనే ఉన్నాయి. మే ౧౩న జరగనున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. ఖమ్మం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురామరెడ్డి తలపడుతున్నారు. మానుకోటలో బీఆర్‌ఎస్ నుంచి మాలోత్ కవిత, బీజేపీ నుంచి సీతారాంనాయక్, కాంగ్రెస్ నుంచి పోరిక బలరాంనాయక్ బరిలో నిలిచారు. జిల్లాలో ౫ నియోజకవర్గాల్లో 9,88,238 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 4,79,626, మహిళలు 5,08,550, ఇతరులు 62 మంది ఉన్నారు. ఎవరెవరు ఎవరి పక్షాన ఓటు వేయనున్నారో వేచిచూడాల్సిందే.