17 April, 2026 | 10:29 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పెట్రోల్ బదులు నీళ్లు?

11-06-2025 01:06 AM

మహబూబాబాద్, జూన్ 10 (విజయ క్రాంతి): పెట్రోల్ పంపులో పెట్రోల్ కు బదులు నీళ్లు నింపిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఓ పెట్రోల్ పంపులో మంగళవారం  జరిగింది. బాధితుడు తోట సాంబయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

తన ద్విచక్ర వాహనంలో మంగళవారం ఉదయం పెట్రోల్ పంపులో రెండు లీటర్ల పెట్రోల్ పోయించుకుని దడువాయి పనిచేయడానికి వెళ్లగా మార్కెట్ కు వెళ్లగానే తన బండి ఆగిపోయిందని చెప్పాడు. విధులు ముగించుకుని ఆగిపోయిన తన బండిని మెకానిక్ వద్దకు తీసుకువెళ్లగా మెకానిక్ పరిశీలించి, పెట్రోల్ ట్యాంక్ కిలో నీళ్లు ఉండటంతో ఆగిపోయిందని చెప్పడంతో, ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ బయటకు తీయడంతో అందులో నీళ్లు కనిపించాయి.

బాటిళ్లలో నీళ్లు కలిసిన పెట్రోలు ఉదయం పెట్రోల్ పోయించుకున్న పంపు వద్దకు తీసుకువెళ్లి నిర్వాహకుడిని గట్టిగా నిలదీయడంతో వర్షాల వల్ల ట్యాంకు అడుగు భాగంలో నీళ్లు చేరి ఉంటాయని, బండి రిపేరు ఖర్చు చెల్లిస్తానని అంగీకరించాడని తెలిపారు. అయితే ఈ ఘటన జరుగుతున్న సమయంలో పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన కొందరు ద్విచక్ర వాహనదారులు పెట్రోల్ కు బదులు నీళ్లు వస్తాయి ఏమో అని పెట్రోల్ పోయించుకోకుండా వెను తిరిగారు. పెట్రోల్ పంపు ద్వారా నీళ్లు వచ్చిన ఘటనపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.