5 July, 2026 | 5:58 PM

Breaking News

జనాభాకు అనుగుణంగా అంగన్వాడీ పోస్టుకు రిజర్వేషన్ కేటాయించాలి   •   పోచ్చర జలపాతానికి సందర్శకుల తాకిడి   •   ఆగస్టు 2న ఏఐటీయూసీ జిల్లా మహాసభలు జయప్రదం చెయ్యండి   •   మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే పాయంని కలిసిన పినపాక మండల అధ్యక్షులు పేరం   •   బీసీలను కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయి   •   రామేశ్వరం ఆర్టీసీ బస్సు   •   జూలై 10 రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి   •   పులిమడుగు బ్రిడ్జి ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •   సీసీ కెమెరాలు ఏర్పాటులో సిద్దిపేట ఆదర్శం   •   ఇల్లందు అధికారుల రిలే దీక్షలకు లక్ష్మీపతి గౌడ్ సంఘీభావం   •  

రైతుల పంట పొలాలకు నీళ్లు విడుదల

23-07-2025 08:49 PM

స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కె ఆర్ నాగరాజు.

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సౌత్ మెయిన్ కెనాల్ నుంచి పంట పొలాలకు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari), వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులు కొబ్బరి కాయ కొట్టి నీళ్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్ కెనాల్ కింద పన్నెండు డిస్ట్రిబ్యూటరీ ద్వారా ఒక లక్ష 6 వేల ఎకరాల సాగుకు నీళ్లు అందనున్నట్లు తెలిపారు.

ఈ కెనాల్ ద్వారా ధర్మసాగర్, అయినవోలు, జాఫర్ గడ్, హసన్ పర్తి మండలాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. 'ఆన్ అండ్ ఆఫ్' పద్ధతిలో రైతులకు నీళ్లు వస్తాయని వర్షాలు సమృద్ధిగా పడితే నిరంతరం నీళ్లు వస్తూనే ఉంటాయని రైతులకు తెలిపారు. రైతులకు ఏకకాలంలోనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రైతులకు రైతు భరోసా, ప్రమాద బీమా, కౌలు రైతులకు 12 వేల రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నీటిపారుదల శాఖ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.