23-07-2025 08:55:02 PM
బోనమెత్తిన సిఐ, ఎస్ఐలు..
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని స్థానిక కేకే-1 సిఎస్పీ ప్రాంతంలోనీ దుర్గ భవానీ ఆలయం(Durga Bhavani Temple) ఆధ్వర్యంలో బుధవారం ఆషాడ మాసం బోనాల జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. బోనాల జాతర సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పట్టణంలోని వెంకటేశ్వర దేవస్థానం నుండి ఆలయం వరకు బోనాలతో, పోతురాజు వేషధారణలతో, డప్పు చప్పుళ్ళతో, కోలాటం, ఆటపాటలతో శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ సిఐ కే శశిధర్ రెడ్డి, ఎస్ఐ ఎస్ రాజ శేఖర్ లు ముఖ్య అతిథులుగా హాజరై, బోనాలను ఎత్తుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నర్సింగ్ భవాని మాట్లాడుతూ, భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, పాడిపంటలు, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని అమ్మ వారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.