04-07-2025 11:25:23 PM
నాగార్జునసాగర్,(విజయక్రాంతి): నాగార్జునసాగర్ ఎడమకాల్వకు విడుదల చేసిన నీరు ఖమ్మంలో తాగునీటి అవసరాల కొరకు ఎడమకాల్వకు నీటి విడుదల హాలియా, ఖమ్మం జిల్లాలో నెలకొని ఉన్న తాగునీటి అవసరాల కొరకు పాలేరు రిజర్వాయర్ కు నాగార్జునసాగర్ డ్యాం నుంచి ఎడమ కాల్వకు శుక్రవారం ఎన్ఎస్ అధికారులు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమకాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద గల గేట్ ను ఎన్ఎస్పీ అసిస్టెంట్ ఇంజనీర్లు కృష్ణయ్య, విజయ్ కుమార్ లు స్విచ్ ఆన్ చేసి కాల్వలోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో నెలకొని ఉన్న తాగునీటి అవసరాల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాగర్ ఎడమ కాల్వ నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని సుమారు 4 రోజుల పాటు విడుదల చేస్తున్నామన్నారు.