05-07-2025 12:00:00 AM
నిర్మల్ జూలై 4 (విజయ క్రాంతి) : బస్టాండ్ కేంద్రంగా అమాయక మహిళల మెడలో నుంచి బంగారం గొలుసులను దొంగలిస్తున్న ఇద్దరు మహిళలను శుక్రవారం అరెస్టు చేసినట్టు నిర్మల్ ఎస్పీ రాకేష్ మీనా తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించారు.
ఈనెల 30న నిర్మల్ బస్టాండ్లోని బోత్ స్టేజ్ వద్ద కడెం మండలానికి చెందిన అనే వృద్ధురాలి మెడలో నుంచి సాగింటి లక్ష్మి పందెన కవిత అనే ఇద్దరు మహిళలు పథకం ప్రకారం వృద్ధురాలి మెడలో నుంచి కత్తెర సాయంతో రెండు తులాల బంగారు గొలుసును అపారించడం జరిగిందన్నారు.
అదిలాబాద్ కు పిట్టల వాడకు చెందిన చాగంటి లక్ష్మి వృద్ధిరాలితో మాటలు కలపగా స్పందిన కవిత గొలుసులు కత్తిరించడంతో వృద్ధురాలు కేకలు వేయగా ఇద్దరు పారిపో యినట్టు తెలిపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో వారి ద్దరిని పట్టుకొని బుధవారం పేటలో అరెస్టు చేయడం జరిగిందని ఎస్పీ రాకేష్ మీనా వివరించారు. పరిచరిలేని మహిళల పట్ల మాటలు కలిపితే అప్రమత్తంగా ఉండాలని అనుమానం ఉం టే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ ప్రవీణ్ కుమార్ ఎస్త్స్ర సంజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.