నటిని బలిగొన్న అలలు
తనకు తీరిక దొరికనప్పుడల్లా వెళ్లే ప్రాంతానికి ప్రియుడితో కలిసి వెళ్లిన ఓ నటి ప్రాణాలు కోల్పోయింది. గతంలో ‘నా ఇల్లు.. భూమ్మీద ది బెస్ట్ ప్లేస్‘ అని సదరు నటి కితాబిచ్చిన చోటే విగత జీవిగా మారింది. రష్యన్ నటి కమిల్లా బెల్యట్సకియా తాజాగా థాయ్‌లాండ్‌లోని కోహ్ సముయి అనే టూరిస్ట్ ప్రాంతానికి ఎంజాయ్ చేయడం కోసం ప్రియుడితో కలిసి వెళ్లారు. కోహ్ సముయి అనేది ఆమెకు అత్యంత ఇష్టమైన సముద్ర తీర ప్రాంతం.
అక్కడకు వెళ్లి సముద్రం ఒడ్డున ఒక రాయిపై ధ్యానంలో కమిల్లా కూర్చొన్నారు. ఆ సమయంలో రాకాసి అలలు వచ్చాయి. అంతే ఆమెను సముద్రంలోకి లాక్కొని వెళ్లాయి. క్షణాల్లో రెస్య్యూ టీమ్ వచ్చింది. అయినా ఫలితం లేకుండా పోయింది. కొని కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం లభ్యమైంది. తనకు అత్యంత ఇష్టమైన ప్లేసే ఆమె ప్రాణాలను బలిగొంది. ప్రస్తుతం కమిల్లా మరణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.






