19-12-2025 02:00:47 AM
కుషాయిగూడ, డిసెంబర్ 1౮ (విజయక్రాంతి): కుషాయిగూడ డివిజన్ కాకుండా చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అడ్డుకున్నారని ఏఎస్‌రావు నగర్ డివిజన్ నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. గురువారం కుషాయిగూడ బస్టాండ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కుషాయిగూడ డివిజన్‌ను మార్చేందుకు స్థానికు లు ప్రజలు ప్రజలందరూ ముక్తకంఠంతో ఉద్యమాలు చేసి ఉద్యమాల ద్వారానే కుషాయిగూడ డివిజన్ సాధించుకున్నాని, బొంతు శ్రీదేవి చెర్లపల్లి డివిజన్లో ఉండి కుషాయిగూడను ఏనాడు పట్టించుకోలేదని, 80 గజాల స్థలంలో ఇల్లు కట్టిన వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేశారని ఆయన ఆరోపించారు.
స్థానికులు అందరూ కులాలకు అతీతం గా కలిసిమెలిసి ఉన్నారని బొంతు శ్రీదేవి కులాల మధ్యన చిచ్చు పెడుతుందని ఆయన విమర్శించారు. సమావేశంలో కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్, అసోసియేషన్ నేతలు సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, బిజెపి సీనియర్ నేత తల ఆనంద్ గౌడ్, చల్ల ప్రభాకర్, కుషాయిగూడ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, నాగార్జున నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు రవి పాల్గొన్నారు.