19-12-2025 01:59:48 AM
ముషీరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాం తి): డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ గా ఇటీవల నూతనంగా నియమితులైన సోమిరెడ్డిని తెలంగాణ రికగ్నై జ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఎన్. రెడ్డి, కోశాధికారి కే. శ్రీకాంత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఎస్. రామ్‌రెడ్డి జాయింట్ సెక్రెటరీ సిహెచ్.శివకుమార్‌లు శుభాకాంక్షలు తెలిపినట్లు గురువా రం వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను జాయింట్ డైరెక్టర్‌కు వివరించామని, స్పందించిన డైరెక్టర్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.