లొంగుబాటుకు మేం సిద్ధం !
-ప్రస్తుత కాల, మాన పరిస్థితుల్లో సాయుధ పోరాటం నిర్మించలేం
-సోను, ఆశన్న బాటలోనే మేమూ సైతం..
-మావోయిస్టు పార్టీ ఉదంతి ఏరియా కమిటీ లేఖ
చర్ల, అక్టోబర్ 18 (విజయక్రాంతి): మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్గీస్‌గఢ్‌లోని జగ్దల్ పూర్ రెండు రోజుల వ్యవధిలోనే మావోయి స్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, ఆశన్న అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు 300 మందికి పైగా పార్టీ సభ్యులతో ఆయా రాష్ట్రాల పోలీసుల ఎదుట లొంగిపోయిన ఘటన మరువ కముందే పార్టీకి మరో షాక్ తగిలింది. తాజా గా శనివారం ‘మేం పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాం. సోను, ఆశన్న లాంటి మావోయిస్టు పార్టీ అగ్రనేతలే ఆయుధాలను ప్రభుత్వాలకు అప్పగించారు.
వారి బాటలోనే మేము కూడా. ప్రస్తుత కాలమాన, పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని కొనసాగించలేం. దళాలపై ఒత్తిడి బాగా పెరిగింది. ఇక ఉద్యమాన్ని సమర్థంగా నిర్మించ లేం. పార్టీ సభ్యులు సాయుధ ఉద్యమాన్ని విరమించేందుకు ముందుకు రావాలి. ఇప్పటికీ అవకాశం ఉంది. ఆలస్యం కాకముందే జాగ్రత్తగా ఆలోచించాలి. సరైన నిర్ణయం తీసుకోవాలి. సహచరులు ఎవరైనా 93299 13220 నంబర్‌కు కాల్ చేయవచ్చు. ఈనెల 20న మధ్యాహ్నం మనందరం సమావేశమవుదాం అంటూ ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబం ద్ జిల్లా ఉదంతి ఏరియా కమిటీ మావోయి స్టు పార్టీసభ్యుడు సునీల్ పేరిట లేఖ విడుదల కావడం చర్చనీయాంశమైంది.
స్వాగతిస్తున్నాం..
గరియాబంద్ జిల్లాలోని గోబ్రా, సీతానది, శక్తి-సారన్‌గఢ్- రాయ్‌గఢ్ ప్రాంతా ల్లో మావోయిస్టుల కార్యకలాపాలు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. వారంతా వీలై నంత త్వరగా పోలీసుల ఎదుట లొంగిపోవాలి. వాకంతా పోలీపులను నేరుగా సంప్రదించవచ్చు. ముందుగా లొంగిపోయిన వారి బాధ్యతలు పోలీసులే చూసు కుంటారు. పోలీసుల ఎదుట లొంగిపోతామని మావోయిస్టు పార్టీ ఉదంతి ఏరి యా కమిటీ విడుదల చేసిన లేఖను మేం స్వాగతిస్తున్నాం. వారంతా జనజీవన స్రవంతిలో కలిసేందుకు సహా య, సహకారాలు అందిస్తాం.
నిఖిల్ రఖేచా, ఎస్పీ, గరియాబంద్




