27 March, 2026 | 7:50 PM

ఎనర్జీ డ్రింక్స్‌పై ఓఆర్‌ఎస్ పదం నిషేధం

19-10-2025 12:50 AM

-ఇతర పానీయాల టెట్రాప్యాక్‌లపై కూడా..

-ఉత్తర్వులు జారీ చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ

-ఫలించిన డాక్టర్ శివరంజని ఎనిమిదేళ్ల పోరాటం

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎనర్జీ డ్రింక్స్‌తో పాటు ఇతర పానీయాలపై ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ (ఓఆర్‌ఎస్) అనే పదాన్ని ఉపయోగించవద్దని భారత ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ విజయం వెనుక హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యనిపుణరాలు శివరంజని కృషి ఎంతో ఉంది. ఈ డిమాండ్‌తో ఆమె ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నారు.

ఎనర్జీ డ్రింక్స్‌పై ఓఆర్‌ఎస్ అనే పదం తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు లేఖలు రా స్తూ వస్తున్నారు. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం.. 245 మి.లీ ఓఆర్‌ఎస్ టెట్రా ప్యాక్‌లో సోడియం క్లోరైడ్, పోటాషియం క్లోరైడ్, సోడియం సిట్రేట్ తదితర ఎలక్ట్రోలై ట్లు తగిన మోతాదులో ఉండాలి. డీహైడ్రేషన్‌కు గురైన వ్యక్తి ఈ ద్రావణాన్ని తీసుకుంటే వెంటనే అతడి శరీరంలో ఖనిజ లవణాలు భర్తీ అవుతాయి. కానీ, ప్రస్తుతం మార్కెట్‌లో ‘ఓఆర్‌ఎస్’ పేరుతో లభిస్తున్నటెట్రాప్యాక్‌లో తయారీ కంపెనీలు ఎక్కువ మోతాదులో చక్కెర వినియోగిస్తున్నారని డాక్టర్ శివరంజ ని ఎనిమిదేళ్ల క్రితం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

కంపెనీల మాయలో పడి ప్రజలు మార్కెట్‌లో దొరికే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు నిజమనవ ని భావించి, వాటిని కొంటున్నారని, తద్వా రా వారు అనారోగ్యానికి గురయ్యే ప్రమా దం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఆ ద్రా వణం చిన్నపిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని, వారికి అధిక మోతాదులో చక్కెర ఉన్న ద్రావణం తాగిస్తే మరింత ప్రమాదమని పేర్కొంటున్నారు. ఎట్టకేలకు ఎఫ్‌ఎస్ ఎస్‌ఏఐ ఉత్తర్వులతో తన పోరాటం ఫలించినట్లయిందని డాక్టర్ శివరంజని హర్షం వ్యక్తం చేస్తున్నారు.