సర్పంచ్ కవిత చేసిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నాం
ఓడేడు గ్రామ బాధిత రైతుల వివరణ
ముత్తారం, జూన్ 25: ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామంలోని సర్వే నంబర్ 402 భూమిపై సర్పంచ్ పోతుపెద్ది కవిత బుధవారం చేసిన ఆరోపణల అదే గ్రామానికి చెందిన రైతులు తీవ్రంగా ఖండించారు.గ్రామానికి చెందిన కాసర్ల లక్ష్మీ నరసింహారెడ్డి, కాసర్ల రవీందర్ రెడ్డి, కొలిపాక చంద్రయ్య, బిక్కినేని కర్నకర్ రావు లు బుధవారం పాత్రికేయుల తో మాట్లాడుతూ తమకు జరిగిన అన్యాయాన్ని, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్నామని తెలిపారు.
వాస్తవాలు ఇవే సర్వే నంబర్ 402
23-7-2026న ఓడేడు గ్రామ సర్పంచ్ కవిత సర్వే నంబర్ 402 లోని భూమి ’సీలింగ్ భూమి’ అని తప్పుడు సమాచారంతో కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారని అన్నారు.
సర్కారు రికార్డుల ప్రకారం
సర్కారు రికార్డుల ప్రకారం, 1957 నుంచి సర్వే నంబర్ 402 పట్టా భూమిగా నమోదై ఉందని, ఇది మా పెద్దల నుండి మాకు సంక్రమించిందని తెలిపారు. సీలింగ్ వివరాలు 1976లో మా తండ్రి కాసర్ల రామకృష్ణారెడ్డి 61.19 ఎకరాల భూమిలో, 1981లో 26.29 ఎకరాలను ప్రభుత్వానికి వదిలి, మిగిలిన 34.30 ఎకరాలను పట్టా భూమిగా 1982 సర్వే డిపార్ట్మెంట్ ద్వారా రికార్డుల్లో నమోదు చేయించుకున్నారని అన్నారు.
ప్రభుత్వానికి విన్నపం
సదరు 34.30 ఎకరాల భూమిని కొలిపాక చంద్రయ్య, బిక్కినేని కర్నకర్ రావు లకు అమ్మడానికి ప్రయత్నించగా, అది ప్రొహిబిషన్ లిస్టులో ఉండటంతో ఎన్‌ఓసి కోసం గత 8 ఏళ్లుగా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నామని, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, జిల్లా కలెక్టర్ కు విన్నవించుకోగా 23-06-2026న స్పాట్ ఇన్స్పెక్షన్ కూడా జరిగిందని,సర్పంచ్ కి ఎలాంటి ఆధారాలు లేకుండానే సర్వే నంబర్ 402లోని 62 ఎకరాలు సీలింగ్ భూమి అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ వద్ద నిజంగా ఏదైనా ఆధారాలు ఉంటే, వాటిని జిల్లా కలెక్టర్ కు సమర్పించాలి తప్ప, ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని, గ్రామ పెద్దగా బాధ్యతాయుతంగా సర్పంచ్ ఉండాలని హితవు పలికారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకోవాలని సర్పంచుకు వారు సూచించారు.






