26 June, 2026 | 2:28 AM

ఎమర్జెన్సీ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం

26-06-2026 12:34 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ దేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. తన సొంత నాయనమ్మే (ఇందిరా గాంధీ) రాజ్యాంగాన్ని అవమానించి ఎమర్జెన్సీ విధి స్తే.. నేడు రాజ్యాంగ పుస్తకం పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీకి అ స్సలు రాజ్యాంగంపై అవగాహనే లేదన్నారు. దేశంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి చీకటి అధ్యాయానికి 51 సం వత్సరాలు పూర్తయిన సందర్భంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ సంకల్పంతో బీజేపీ తెలం గాణ రాష్ట్ర కార్యాలయంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం (సంవిధాన్ హత్యా దివస్) సమా వేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మ హారాష్ట్ర, హర్యానా మాజీ గవర్నర్‌లు సీహె చ్ విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్.రాంచందర్ రావు మాట్లాడు తూ, 1975లో నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తన అధికారాన్ని కాపాడుకునేందుకు దేశంపై అప్రకటిత చీకటి రోజైన ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగాన్ని తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు.

1961 జూన్ 27న నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పబ్లిక్ సర్వీసుల్లో కులం ప్రా తిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం తనకు ఇష్టం లేదని స్వయంగా లేఖ రాసిన విషయం ఆన్-రికార్డులో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముస్లిం రిజర్వేషన్ల పేరిట చేసిన రాజకీయాల వల్లే గిరిజనులకు (ట్రైబల్స్) దక్కాల్సిన రిజర్వేషన్లు కోర్టు స్టేల వల్ల నిలిచిపోయాయన్నారు. 1931 తర్వాత సమగ్ర కులగణనపై స్పష్టమైన సంకల్పంతో ముందుకు వచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమేనన్నారు. సమావేశంలో బిజేపీ ప్రజాప్రతిని ధులు, నాయకులు పాల్గొన్నారు.