షూటింగ్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం
సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్‌గా రూపొందుతున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్’. రాకేశ్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారాగణంగా ఉన్నారు. కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మిస్తున్నారు. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో కథానాయికలు స్రవంతి ప్రత్తిపాటి, మాసస వీణ ఆదివారం పాత్రికేయులతో ముచ్చటించారు.
మానస వీణ మాట్లాడుతూ ‘ఇది నా తొలి ఫీచర్ ఫిలిం. ఈ చిత్రంలో అరుణి ఆచార్య అనే పాత్రలో నటించా. ఈ పాత్ర నాకు పర్సనల్‌గా ఎంతో నచ్చింది. నా పాత్ర కోసం కొద్దిగా రీసెర్చ్ చేశా. చిత్రీకరణ మొత్తం యూఎస్‌లో జరిగింది.
ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్నో ఛాలెంజ్‌లను ఫేస్ చేశాం’ అన్నారు. స్రవంతి ప్రత్తిపాటి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు అకిరా. తప్పకుండా నా పాత్ర అందరికి నచ్చతుందనే నమ్మకం ఉంది. అమెరికాలోని అడవుల్లో, చాలా రిస్కీ ప్రదేశాల్లో చిత్రీకరణ జరిగింది’ అని తెలిపారు.




