03-02-2026 12:18:34 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): తాడిచర్ల బొగ్గు గనులను 2015 ఆగస్టు 31న తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు కేటాయించినట్లు కేంద్రమంత్రి కిష న్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తాడిచర్ల గనులు ఇంకా ఎవరికీ కేటాయించలేదని ఆయన తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగం గా ప్రశ్నోత్తరాల సమయంలో సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమా ర్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
2019 మార్చిలో ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆమోదం తర్వాత 2020 జూన్ నుం చి బొగ్గు గనుల కేటాయింపుల ప్రక్రియ మారిందని తెలిపారు. వ్యాపారపరమైన కార్యకలాపాలకు ఉపయోగించే గనులన్నింటినీ వేలం ద్వారానే కేటాయించాలని ఉన్నత స్థాయి కమిటీ కీలక సూచన చేసిందని పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితులు, తప్పని పరిస్థితు ల్లోనే బొగ్గు మంత్రిత్వశాఖ నేరుగా కేటాయించాలని ఉన్నత స్థాయి కమిటీ స్పష్టం చేసిందని తెలిపారు.