12 June, 2026 | 6:41 AM

ప్రపంచంలోని దేశాలకు ఆదర్శంగా నిలిపాం

14-12-2025 01:24 AM

ముల్కనూర్ సహకారం సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి

భీమదేవరపల్లి, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ముల్కనూర్ సహకార సంఘాన్ని భారతదేశానికి ఆదర్శంగా నిలిపామని సహ కార సంఘం అధ్యక్షుడు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. ములుకనూరు సహకార సం ఘాన్ని శనివారం రాత్రి ఆల్ ఇండియా సహకార్ భారతి సభ్యుడు  క్యాంపునకు కో-ఆప్ సొసైటీ అధ్యక్షుడు ఎస్.ఆర్.సతీష్ చంద్ర, సహకార్ భారతి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ సంఘటన్ ప్రముఖ్ హైదరాబాద్ పొన్నాల యాదగిరి,

సహకార్ భారతి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమకొండ అకారపు ఉమేందర్, సహకార్ భారతి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆముదాల భాస్కర్, సహకార్ భారతి హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు నల్లపు కోటేశ్వర్, సహ కార్ భారతి హనుమకొండ జిల్లా కార్యదర్శి లెక్కల ఇంద్రసేనారెడ్డి సందర్శించారు. వీరికి సంఘ అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ములుకనూరు సహకార సం ఘం సంఘంలోని రైతులకు చేస్తున్న కార్యకలాపాలను గురించి డాక్యూమెంటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినా రు.  కార్యక్రమంలో సంఘ జనరల్ మేనేజర్ యం. రాంరెడ్డి,ఉద్యోగులు పాల్గొన్నారు.