calender_icon.png 15 January, 2026 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ఎమ్మెల్యేలు చేయని పని చేసి చూపించాం..

15-01-2026 01:57:50 AM

స్లాట్టర్ హౌస్ తొలగింపులో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): గత 30 ఏళ్లుగా స్లాటర్ హౌస్ తొలగింపు కోసం గతంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను, మున్సిపల్ చైర్మన్‌లను స్థానిక ప్రజలు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కానీ బీజేపీ ఎమ్మెల్యే ను గెలిపించినందుకు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ స్లాటర్ హౌస్ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.

ఆదిలాబాద్ పట్టణ ప్రజలు గత కొన్నేళ్లుగా స్లాటర్ హౌస్ దుర్వాసన తో ఇబ్బంది పడుతున్న సమస్య పరిష్కారానికి బుధవారం స్లాటర్ హౌస్ తొలగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దగ్గరుండి చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర మాట్లాడుతూ... బీజేపీకి ఓటేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని, మంచి జరుగుతోందని చెప్పడానికి ఆదిలాబాద్‌లో పలు ఉదాహరణలు ఉన్నాయని అన్నారు.

ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జి నిర్మాణం, పట్టణంలో తోపుడు బండ్ల తొలగింపుతో పాటు కచ్ కంటి గ్రామానికి కి వెళ్లే దారిలో ఉన్న స్లాటర్ హౌస్ తొలగింపు కార్యక్రమాలే నిదర్శనమని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, మున్సిపల్ అధికారులు ఉన్నారు.