15-01-2026 01:58:55 AM
మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
నిర్మల్, జనవరి ౧4 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి 16న నిర్మల్ జిల్లా పర్యటన బహిరంగ సభ ఉన్నందున ప్రజల పెద్ద ఎత్తున పాల్గొనాలని రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించి బహిరంగ సభ ఏర్పాట్లను సంబంధిత అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు వేదిక నిర్మాణం వీఐపీ గ్యాలరీ ప్రెస్ మీడియా గ్యాలరీ ఇతర వివరాలు పక్కగా ఉండాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా నిర్మల్ జిల్లాకు ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నందున పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంత చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సదర్‌మాట్ బ్యారేజ్ వద్దకు వెళ్లి అక్కడ ఏర్పాట్లను అడిగి తెలుసు కున్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, రాష్ట్ర మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విట్టల్, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, విఠల్‌రెడ్డి, నారాయణరావుపటేల్, నియోజకవర్గ ఇన్చార్జి రావు శ్రీహరిరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమద్ అలీ, కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ అప్పల గణేష్ చక్రవర్తి స్థానిక నాయకులు ఉన్నారు