15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

04-02-2026 01:13 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, ఫిబ్రవరి ౩ (విజయక్రాంతి): పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో, పదవ తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయని, అన్ని ప్రభు త్వ బడుల్లో ప్రతిరోజు విద్యార్థులు, ఉపాధ్యాయుల వంద శాతం హాజరు ఉండాలన్నారు. తరచూ బడికి రాని పిల్లల ఇండ్లకు వెళ్లి, వారి పోషకులతో మాట్లాడి తరగతులకు హాజరయ్యేలా చూడాలని సూచించారు.

ఎప్పటిక ప్పుడు పోషకులతో సమావేశం నిర్వహిస్తూ, వారి పిల్లల ప్రతిభకు సంబంధించి వివరాల ను వారితో పంచుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తూ, చదువులో వెనకబడిన పిల్లలు ముందుకు వెళ్లాలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొ న్నారు. పరీక్షల ఫలితాలు, హాజరు శాతం వివరాలు విద్యార్థుల ఫలితాలు, హాజరు శాతం తమకు అందజేస్తూ ఉండాలని చెప్పారు.

అన్ని పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఎక్కువ మార్కులు వచ్చే ముఖ్యమైన పాఠాలు ఎక్కువగా చదివిపించాలని సూచించారు. విద్యా ర్థులను ప్రోత్సహిస్తూ, పరీక్షలపై భయం, ఒత్తి డి దూరం చేస్తూ వారిని ప్రశాంతంగా పరీక్షలకు హాజరయ్యేలా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఈఓ భోజన్న, అధికారు లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.