17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

వారసంతతో వ్యాపారాలు పెంచుకోవాలి

04-02-2026 01:14 AM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ 

ఖానాపూర్, ఫిబ్రవరి ౩ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామపంచాయతీలో మంగళవారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేతుల మీదుగా వారసంత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వారసంతను ఉపయోగించుకొని లబ్ధి పొందాలని, వ్యాపారాలు పెంచుకోవాలన్నారు. ఈ వారసంత ప్రతి మంగళవారం కొనసాగుతుందని సర్పంచ్ ఏలేటి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

ఈ సంతలో గొర్రెలు, ఎద్దులు, ఆవులు, కోళ్లు, కూరగాయలు, వంటి వ్యాపారాలు చేసుకోవడానికి స్థానికంగా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాజీద్, మాజీ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, సర్పంచి పోలంపల్లి సచిన్, గ్రామ ఉప సర్పంచ్ పెద్దిరాజు ఉన్నారు.

అభ్యర్థులకు బీఫాంల అందజేత

ఖానాపూర్ మున్సిపాలిటీ బరిలో ఉన్న అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి ఆశావాహుల సంఖ్య అధికంగా ఉండడంతో ఆయా వార్డుల్లో పార్టీ రెబల్సుగా కొందరు అభ్యర్థులు నామినేషన్ వేశారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే వెడుమా బొజ్జు పటేల్ రెబల్స్ను భుజగించి ఉపసంహరింప చేశారు. ఎట్టకేలకు అభ్యర్థులను ఖరారు చేసి వారికి బీఫాములను అందజేశారు.

ఒకటవ వార్డు నుంచి గొర్రె తిరుమల గంగాధర్, రెండవ వార్డు నుంచి దేవత రాజేశ్వర్, మూడవ వార్డు నుంచి జన్నారపు విజయలక్ష్మి శంకర్ ,నాలుగో వార్డ్ మహేష్ కస్తూరి, ఐదవ వార్డు నుంచి నేత పవిత్ర శ్యామ్ ,ఆరవ వార్డు నుంచి హఫీనా బేగం అమానుల్లా, ఏడవ వార్డు పోలంపల్లి రమేష్ ,8వ వార్డు అస్మత్ జహా షౌకత్ పాషా ,తొమ్మిదవ వార్డ్ చింతపండు లక్ష్మీ రవి, 10 వార్డ్ తొంటి రాధ శ్రీనివాస్, 11వ వార్డు చిన్నం సత్యం రాజురా, 12వ వార్డు లావుడియా లాలు లకు బీఫాంలో అందజేశారు.