26 April, 2026 | 1:52 AM

అబ్కారీ శాఖకు గౌరవం తీసుకురావాలి

26-04-2026 12:31 AM
  1. ఎక్సైజ్ ఎన్పోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం 
  2. ఎక్సైజ్ టీమ్‌లకు నగదు ప్రొత్సహాకాలు అందజేత 

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ టీములు బాగా పని చేసి ఎక్సైజ్ శాఖకు మంచి పేరు తీసుక రావాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం సూచించారు. గంజాయి, డ్రగ్స్ పట్టుకున్న 20 ఎక్సైజ్ టీమ్‌లకు శనివారం ఆబ్కారీ భవన్‌లో డైరెక్టర్ షానావాజ్ ఖాసీం నగదు ప్రొత్సహాకాలను అందజేశారు.

ఖమ్మం జిల్లాలోని ఖమ్మం-టూ స్టేషన్‌లో 30.96 కేజీలు, ఖమ్మం వన్ స్టేషన్‌లో 23.6 కేజీలు, మధిరలో 22 కేజీలు, కొత్తగూడేం భద్రాచలంలో 170 కేజీలతో కలిసి మొత్తంగా 265.96 కేజీలు గంజాయిని ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు పట్టుకున్నాయని ఆయన తెలిపారు. ఇక దూళిపేట్‌లో 21.425 కేజీల, హైదరాబాద్‌లో 1920   కేజీల గంజాయి చాక్లెట్లను పట్టుకున్న టీమ్‌లకు కూడా నగదు ప్రొత్సహాకాలు ఇచ్చారు. మొత్తం 12 గంజాయి కేసులు, 8 డ్రగ్స్ కేసుల్లో నగదు రివార్డులు అందించారు.

ఇక సంగారెడ్డిలోని జాహీరాబాద్‌లో 46.020 కేజీల నిట్రా జిప్సమ్, నిజామాబాద్‌లో 2.020 కేజీ ల ఓపీఎం, 609 గ్రాముల ఆల్పోజోలం, కాచిగూడలో 113 ఎల్‌ఎస్డి బాక్స్, చార్మీనార్‌లో 1920 కేజీల గంజాయి చాక్లెట్లు, నారాయణగూడలో 33.3 గ్రాముల కోకైన్, ఆమీర్‌పేటలో 14.83 ఎండిఎంఎ , ధూల్‌పేటలో 12.29 గ్రాముల ఎండీఎంఎ కేసుల్లో నగదు  ప్రోత్సహాక రివార్డులు అందించారు.

కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ అంజన్‌రావు, డిప్యూటి కమిషనర్ ప్రణవీ,  ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ జి. గణేష్‌తో పాటు ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్,ఎక్సైజ్ టీమ్‌లు ఎస్‌ఐ, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.