20 July, 2026 | 5:45 PM

Breaking News

తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్   •   ఓటరు జాబితా సవరణ సర్ కార్యక్రమాన్ని విజయవం చేయాలి   •   వారాహి మాత మాలధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ   •   శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •  

బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలి

20-07-2026 12:21 AM

జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వర్లు

ఘట్ కేసర్, జూలై 19 (విజయక్రాంతి) : విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ (రిటైర్డ్) బి. వెంకటేశ్వర్లు అన్నారు. పోచారం డివిజన్ పరిధిలోని నారపల్లి సమీపంలోని రోటర్ డ్యాం స్కూల్ లో విద్యార్థులచే పాలకమండలిని ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా ఇన్వెస్టీచర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమoలో పిల్లలచే వివిధ పదవులను అలంకరింప చేశారు. 

ప్రధానోపాద్యాయురాలు పిల్లలచే ప్రమాణ స్వీకారం చేయిం చారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు. సందర్భంగా ముఖ్య అతిథి వెంకటేశ్వర్లు మాట్లా డుతూ పిల్లలు భాద్యతాయుతమైన పౌరులు గా ఎదగాలని, క్రమశిక్షణ పట్టుదలతో ఉంటే అమకున్నది సాధించవచ్చన్నా రు. చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలు పెంచు కుంటే మనతో పాటు సమాజంలో మార్పు ను తీసుకురాగలమన్నారు.

ముఖ్యంగా రో డ్డు ప్రమాదాల నివారణ కోసం పాటుపడాలని పాటుపడాలని  అభిప్రాయపడ్డారు. పా ఠశాల డైరెక్టర్ శ్వేతారెడ్డి మాట్లాడుతూ గెలుపోటములు తాత్కాలికం కాని క్రమశిక్షణతో ఉండి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటే ఎ ప్పుడూ విజయం మన వెంటే ఉంటుందన్నా రు. నాయకత్వ లక్షణాలను వెలికి తీసేలా ఎన్నికలు నిర్వహంచినట్లు హెచ్‌ఎం రూపారెడ్డి తెలిపారు.