6 June, 2026 | 2:46 AM

మొక్కలు నాటి సంరక్షించాలి

06-06-2026 01:26 AM

ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి 

ఘట్ కేసర్, జూన్ 5 (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి అన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం (వనమహోత్సవం) 2026-27 కార్యక్రమాన్ని శుక్రవారం ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ శ్మశానవాటికలో  నిర్వహించారు.ఈకార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వాణి పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు.ఈకార్యక్రమంలో ఏఈఈ (ఎస్ డబ్ల్యూ ఎం) బి. చంద్రశేఖర్, యుబిడి  డిప్యూటీ మేనేజర్ బి. శ్రావణ్ కుమార్, అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, స్థానిక ప్రజలు పాల్గొని మొక్కలు నాటారు.ఈ వనమహోత్సవ కార్యక్రమం ఘట్కేసర్ సర్కిల్, ఉప్పల్ జోన్, ఎంఎంసీ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది.