పొర్లుదండాలు పెట్టినా.. మీ పాపాలు పోవు!
ఎవరి పాలన ఏందో అసెంబ్లీలో చర్చిద్దామా, దమ్ముందా.. చర్చలో ఓడితే నేను క్షమాపణ చెబుతా!
- బీఆర్‌ఎస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్
- పాలమూరు జిల్లాలో గులాబీ జెండా ఎగురనివ్వం
- జెండా గద్దెలు కూల్చుడే.. ఆ పార్టీ నుంచి ఒక్కరినీ గెలువనివ్వం
- రెండున్నరేళ్లలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
- మట్టికిపోయినా.. వెట్టికిపోయినా మనోడే ఉండాలంటారు..
- అందుకే.. మీ జిల్లావాణ్ణి, మీకోసం వచ్చా!
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టినచోటే బీఆర్‌ఎస్ నేతలు ఓట్లడగాలి..
- ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినచోటే నేను ఓట్లడుగుతా..
- ప్రాజెక్టులపై పట్టింపులేని బీజేపీ ఎంపీలు
- జడ్చర్ల బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబ్‌నగర్, జూన్ 5 (విజయక్రాంతి): పొర్లు దండాలు పెట్టినా బీఆర్‌ఎస్ నేతలు చేసిన పాపాలు పోవు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తన రెండున్నరేళ్లన పాలన, బీఆర్‌ఎస్ పదేళ్ల పాల నై అసెంబ్లీలో చర్చించే దమ్ముందా అని బీఆర్‌ఎస్‌కు సవాల్ చేశారు. చర్చలో ఓడితే తాను క్షమా పణ చెపుతానన్నారు. పాలమూరు జిల్లాలో గులాబీ జెండా ఎగురనివ్వబోమని, ఆ పార్టీ నుంచి ఒక్కరినీ గెలువనివ్వబోమని సవాల్ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం గల్లీలో కేడీ అయిన ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడుతానని రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభ లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. నాడు కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టినా పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయలేదని విమర్శించారు. తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన తమకు సంపూర్ణ మద్దతు తెలిపి మొక్క నాటారని వృక్షమై మీ ముం దుకు ముఖ్యమంత్రిగా వచ్చానన్నారు.
మట్టికిపోయినా.. వెట్టికిపోయినా మనోడే ఉండాలంటారని అందుకే మీ జిల్లావాణ్ణి, మీకోసం వచ్చానని చెప్పారు. పదేళ్ల సమయం కేసీఆర్ వృథా చేశారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గత ప్రభుత్వం ఎక్కడ కట్టిందో ఆ గ్రామంలో మాత్రమే ఓట్లు అడగాలని, ఇందిరమ్మ ఇండ్లు కట్టిన గ్రామా ల్లో తాము ఓట్లు అడుగుతామని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలను 2009లో మోసం చేసినట్టే మరోసారి మోసం చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
‘కేసీఆర్ నువ్వు గుర్తుపెట్టుకో పాలమూరు జిల్లా లో నీ జెండాను ఎగరనివ్వం, నీ గద్దెలు కు లాలే, నీ జెండాలు పడిపోవాలి అనేలా మా ర్పు వస్తుంది. భవిష్యత్తులో మీ పార్టీ నుంచి ఒక్కరిని కూడా గెలవనివ్వం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, తూడి మేఘారెడ్డి, డా.ప ర్ణికరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనరెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు.
ప్రాజెక్టులను పూర్తి చేస్తాం..
కృష్ణా నది జలాలపై రాయలసీమతో ఆంధ్రులతో కొట్లాడాలని, ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని మాట్లాడితే కేసీఆర్ అడ్డు పడతారని ప్రశ్నించారు. కేసీఆర్ తలకిందులు చేసి తపస్సు చేసినా డిసెంబర్‌లోపు పక్క రాష్ట్రం తోటి సంప్రదింపులు చేసి 90 టీఎంసీలకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబం ధించి ఎన్‌ఓసి తీసుకువస్తామని చెప్పారు. దిండి ప్రాజెక్టు నుంచి 20 నుంచి 30 టీఎంసీలకు అనుమతి తీసుకువచ్చేందుకు బాధ్య త తీసుకుంటానన్నారు.
ఉదండపూర్ వరకు ప్రాజెక్టుల నుంచి నీరు తీసుకువచ్చేలా ఏడా ది సమయంలోపు పూర్తి చేస్తామన్నారు. రాబోయే రెండున్నర ఏళ్లలో జూరాల దగ్గర కొత్త రిజర్వాయర్ కట్టుకోవడంతోపాటు, మక్తల్ సరిహద్దుల్లో బ్రిడ్జి కం బ్యారేజీలను కడుతామని చెప్పారు. పాలమూరు జిల్లాలో జరుగుతున్న అన్ని ప్రాజెక్టులకు గ్రీన్ చానెల్ నిధులు తీసుకువచ్చి పూర్తి చేస్తామన్నారు.
ప్రాజెక్టులపై బీజేపీ ఎంపీలకు పట్టింపులేదు..
గోదావరి జలాలపై మహారాష్ట్ర సీఎంతో మాట్లాడదామంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ బీజేపీ ఎంపీలు పట్టించుకోవడంలేదని, మహారాష్ట్ర సీఎం కూడా పారిపోవడం విడ్డూరంగా ఉందని సీఎం చెప్పారు. మహారాష్ట్ర సిఎం చర్చలకు వచ్చేలా బీజేపీ ఎంపీలు కృషి చే యాలన్నా రు. గోదావరి జిల్లాలపై ప్రాజెక్టు కట్టి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ వరకు రైతుల కష్టాలు తీరుద్దామని సీఎం పేర్కొన్నారు.
పాలమూరు కష్టాలు తెలుసు: మంత్రి వాకిటి శ్రీహరి
జూరాల ప్రాజెక్టు కొరకు భూములు కోల్పోయిన గ్రామస్తుల అవస్తలు, కష్టాలు మాకు తెలుసని, అందుకే ఉదండాపూర్‌లో భూములు కోల్పోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేశామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా భూ నిర్వాసితుల సమస్యలు తీర్చడం వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
సంక్షేమంపై ఎల్బీ స్టేడియంలో చర్చకు రండి..
రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నామని సీఎం అన్నారు. పదిహేను లక్ష ల రేషన్ కార్డులు ఇచ్చామని, 4.50 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని, 50 ల క్షల కుటుంబాలకు 200 యూనిట్ల విద్యు త్ ఉచిత విద్యుత్, 45 లక్షల కుటుంబాలకు రూ.500 కే సిలిండర్లు, రూ.10 వేల కోట్లు ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి చెల్లించామని చెప్పారు. 67,616 ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఈ లెక్క మీద అనుమానం ఉంటే తారీఖు చెప్పి, ఎల్బీ స్టేడియం లో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.25 వేల 616 కోట్లను రుణమాఫీ చేశామని, రూ.27వేల కోట్లను రైతు భరోసా కిం ద ఇచ్చామని పేర్కొన్నారు. రూ లక్ష 57 వేల కోట్లను వ్యవసాయానికి ఖర్చు చేసినట్టు తెలిపారు. ‘నీ పేరు చంద్రశేఖర్ అయితే అసెంబ్లీకి రా, నీ పదేళ్ల పరిపాలనపై నేను చేసిన రెండున్నరేళ్ల పరిపాలనపై చర్చిద్దామన్నారు. చర్చలో ఓడిపోతే అక్కడికక్కడే క్షమాపణ చెపుతానని, లేకపోతే నీ ఫామ్‌హౌస్‌లో నువ్వు బొక్క బోర్ల పండుకోవాలని సవాల్ చేశారు.
తాడు బొంగరం లేని ఇద్దరిని ఊరు మీదికి వదిలారని, ఒకతను ఉదయం ప్రెస్‌మీట్ పెడితే మరోకథను ఎక్స్‌లో స్పందిస్తారని వ్యాఖ్యానించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పాలమూరులో ఒకతను పాదయాత్ర చేస్తానని కాశి వరకు పోరాడి యాత్ర చేసిన కొరిగేదేమీ లేదన్నారు. 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధి కారంలో ఉంటుందని దమ్ముంటే కేసీఆర్ రావాలని, 2029లో ఎన్నికల్లో చూసుకుందామన్నారు.
పాలమూరు వాసుల వలసల కష్టాలు, ఆత్మహత్యల నష్టాలు మనకు తెలుసని, పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వలస వచ్చిన కేసీఆర్‌ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకొని పార్లమెంట్ సభ్యునిగా గెలిపించారని చెప్పారు. కానీ పాలమూరుకు తిరిగి ఒక్కసారి రాలేదని, పార్లమెంటులో గొంతు వినిపించలేద న్నారు.
ప్రతిపక్ష సభ్యులు కొందరు పాదయాత్రలు చేస్తామంటున్నారని, పాద యాత్ర కాదు కాశీదాక పొర్లు దండాలు పెట్టినా మీరు చేసిన పాపాలు తొలిగిపోవు అని, ప్రజలు క్షమించరని చెప్పారు. పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలనే సంకల్పంతో పని చేస్తున్నామని స్పష్టం చేశారు.
అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను ఇదే టర్మ్ లో పూర్తి చేస్తామని, సంవత్సర కా లంలో శ్రీశైలం నుంచి ఉదండాపూర్ వరకు నీటిని తీసుకువస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఉదండపూర్ నుంచి లక్ష్మీదేవి పల్లి వరకు భూసేకరణ చేపడతామని తెలియజేశారు. 6 నెలల్లో భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భూములు కోల్పోయిన రైతులకు నెల రోజుల్లోనే 630 కోట్లు విడు దల చేశామని చెప్పారు. తమ హయాం లో ఏటా రూ.40 వేల కోట్ల ధాన్యం కొని రైతులకు చెల్లించామన్నారు. ఈ యాసంగిలో దేశం మొత్తంలో 60 శా తం ధాన్యం తెలంగాణలోనే కొనుగోలు చేసినట్లు తెలిపారు.
సాగునీరు ఇవ్వడమే లక్ష్యం: మంత్రి జూపల్లి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగు నీరు ఇవ్వడమే లక్ష్యమని మంత్రి జూపల్లి అ న్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పులు చేసి కూ డా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయిందని చెప్పారు. కేసీఆర్ ఇలాకాకు 50 టీఎంసీల మల్ల న్న సాగర్ నిర్మించుకున్నాడని, ఇక్కడ ఎందుకు ప్రాజెక్టు పూర్తి చేయలేదని అ న్నారు. పాలమూరు రైతుల కష్టాలు, స మస్యలు తీర్చేందుకు ఈ ప్రభుత్వం కృ త నిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం చేశారు.






