26-06-2025 12:26:43 AM
చేవెళ్ల, జూన్ 25: ట్రేడింగ్ లైసెన్స్, ఎలాంటి అనుమతులు లేకుండా సిల్వర్ డెల్ స్కూల్ యూనిఫామ్ అమ్ముతున్న షాప్ ను మున్సిపల్ అధికారులు మూసివేశారు. బుధవారం స్కూల్ యూనిఫామ్స్ అమ్ముతున్న విషయం తెలుసుకున్న పీడీఎస్ యూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్, కార్యదర్శి రాజేష్ అక్కడికి చేరుకొని అధికారులకు సమాచారం ఇచ్చారు.
స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు యూనిఫామ్స్ విక్రయిస్తు న్నారని ఆరోపించారు. వ్యాపారం నడిపిన షాపు యజమానిపై చర్యలు తీసుకోవడం తో పాటు ,స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన అధికారులు వెంటనే షాపును మూసివేయించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామనిచెప్పారు.