3 August, 2026 | 1:35 AM

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి

03-08-2026 12:56 AM
  1. ఆగస్టు 6 నుంచి 12వరకు  జిల్లా వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు
  2. సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ని జయప్రదం చేయాలి
  3. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముత్యాల విశ్వనాథం 

పాల్వంచ, ఆగస్టు 2 (విజయక్రాంతి): సీతారామ, సీతమ్మధార  ప్రాజెక్టుల ద్వారా జిల్లా రైతాంగానికి సాగు జలాలు అందించాలని సిపిఐ సిపిఐ రాష్ట్ర నాయకులు ముత్యాల విశ్వనాథం డిమాండ్ చేశారు. పాల్వంచలోని ’సిఆర్ భవన్’లో ఆదివారం కోటి తిరుపతయ్య అధ్యక్షతన జరిగిన పాల్వంచ మండలం కౌన్సిల్ ముఖ్యల ప్రజాసంఘాల బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏళ్లు గడుస్తున్నా అర్హులైన రైతులకు పోడు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం తగదన్నారు.

నిరుపేదలకు ఇళ్లు, స్థలాలు కేటాయించడంలో తీవ్ర వైఫల్యం చెందిందని, సీతారామ ప్రాజెక్టు సాగునీరు పాల్వంచ మండలంలోని రైతాంగానికి ఇవ్వాలని., ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పాల్వంచలో 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, స్కీం వర్కర్ల జీవితాలతో ఆటలాడకుండా ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలయ్యేలా చూడాలన్నారు.

ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంలో నిర్లక్ష్యం సరికాదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఆగష్టు 6 నుండి 12 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలు పాల్వంచ మండలంలో 8 వ తారీకు రంగాపురం నుండి చంద్రాలగూడెం వరకు చేపడుతున్నామని, రాబోయే రోజుల్లో సిపిఐ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు నిర్మిస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ  మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు నిమ్మల రాంబాబు, ఇట్టి వెంకట్రావు, చెన్నయ్య. వేములపల్లి శ్రీనివాసరావు, కొంగర అప్పారావు తదితరులు పాల్గొన్నారు.