మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాజీ ఎంపీ నామ సుడిగాలి పర్యటన
పరామర్శలు, ఆశీర్వాదాలు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎంపీ నామ
ఖమ్మం, ఆగస్టు 2 (విజయక్రాంతి): ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ గ్రానైట్ వ్యాపారి బుగ్గవీటి శ్రీధర్ తండ్రి, ప్రముఖ వైద్యులు డా. బుగ్గవీటి సమత మామయ్య, రిటైర్డ్ ఇంజనీర్ బుగ్గవీటి కోటేశ్వరరావు ఇటీవల పరమపదించిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఆదివారం ఖమ్మం నగరంలోని వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కోటేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన నామ,
అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు వియ్యంకుడు, తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ డా. వాసిరెడ్డి రామనాథం, డా. గౌతమ్, కుటుంబ సభ్యులు, నాయకులు కనకమేడల సత్యనారాయణ, మోరంపూడి ప్రసాద్రావు, వాకదాని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అటుపై చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామ మాజీ సర్పంచ్ వేముల నర్సయ్య అనారోగ్యంతో ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని,
ఖమ్మం మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. నర్సయ్య ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న నామ, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తదుపరి బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు వనమా విశ్వేశ్వరరావు ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకొని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని ప్రజా, సామాజిక కార్యక్రమాల్లో మళ్లీ చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం వైరా మున్సిపాలిటీ 5వ వార్డుకు చెందిన కొణతాలపల్లి సుబ్బారావు నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆపై మధిర పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మహదేవపురం సర్పంచ్ వాసిరెడ్డి నాగేశ్వరరావు మనవడు పంచకట్టు వేడుకలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలిసి పాల్గొని పావన్ శివచంద్రను ఆశీర్వదించారు.
చివరగా ఇటీవల తన మాతృమూర్తిని కోల్పోయిన మాజీ వార్డు కౌన్సిలర్ ధీరావత్ మాధవి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు, మాజీ మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు, మాజీ పట్టణ అధ్యక్షుడు మద్దెల రవి, మాజీ జడ్పీటీసీ సామినేని హరి ప్రసాద్, మాజీ దిశా కమిటీ సభ్యులు బాదావత్ బాలాజీ, బిక్కి కృష్ణప్రసాద్, రావూరి శ్రీనివాసరరావు, పల్లపోతుల వెంకటేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరరావు,
యన్నంశెట్టి అప్పారావు, బొగ్గుల భాస్కర్ రెడ్డి, అరిగే శ్రీనివాసరరావు, మోరంపూడి ప్రసాద్రావు, బంకా మల్లయ్య, వంకాయలపాటి లచ్చయ్య, మాదినేని దుర్గాప్రసాద్, వాకదాని కోటేశ్వరరావు, అబ్బూరి రామన్, వనమా చిన్ని, పెరుమాళ్ల కృష్ణమూర్తి, మిట్టపల్లి సత్యంబాబు, తిరుపతి శ్రీను, నూకల వాసు,నూకల ప్రసాద్, వజినేపల్లి చక్రవర్తి, కారేపల్లి రామకృష్ణ, రంగా సింహాద్రి, రాయిడి భద్రయ్య, బాలాజీ, కొమ్మూరి కనకరత్నం, వేముల శివకృష్ణ, గుజ్జర్లపూడి దేవరాజు,
యూఎస్కే ఖాసిం, వెంకటేశ్వరరావు, గజ్జల కృష్ణమూర్తి, ఖాజా సైదులు, కొణతాలపల్లి సుజిత్, దారా కృష్ణ, కిషోర్, కేశ శ్రీనివాసరావు, నాళ్ల గంగాధర్, ఖాజా ప్రవీణ్ కుమార్, కోదుమూరు రవి, ఏదునూరి శ్రీనివాసరావు, వల్లభి శ్రీనివాసరావు, పగడాల రవి, నంబూరి రామారావు, మాదినేని లక్ష్మణ్, కోడుమూరు మోహన్, ఆకుల రాజు, ఏలూరు నరసింహారావు, అదూరి ప్రేమ్, నార్వనేని నారాయణ, మాలోజి రాజేష్, కొలగాని దేవరాజు, తెల్లాకుల శ్రీనివాసరావు, ముచ్చింతల కృష్ణా, కోలకాని నాగేశ్వరరావు, పాగి నాగార్జున, యండ్రాతి గోపాలరావు, ముదిగొండ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.






