6 June, 2026 | 2:13 AM

పర్యావరణ పరిరక్షణకు బాధ్యత వహించాలి

06-06-2026 01:06 AM

ప్రధానోపాధ్యాయులు మధు

నేరేడుచర్ల, జూన్ 5: పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయుల నేతృత్వంలో పాఠశాల ‘ఎకో క్లబ్‘ మరియు ‘యంగ్ ఎర్త్ లీడర్స్‘విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటి, పాఠశాల ’మద ర్ ట్రీ ’వద్ద పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం ఆయన  మాట్లాడుతూ ప ర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ ప్రతి సం వత్సరం 5 మొక్కలు నాటి సంరక్షించాలన్నా రు. అలాగే నీటి వృధా అరికట్టాలని, చెత్తాచెదార వ్యర్ధాలను రీ సైక్లింగ్ ద్వారా వనరులు గా ఉపయోగించవచ్చన్నారు. ప్లాస్టిక్ రహిత వస్తువుల వినియోగం, పెట్రోలు, విద్యుత్తు మొదలగునవి ఆదా చేయడం, కనీసం వారంలో ఒకరోజు సెల్‌ఫోన్ ఉపయోగించకపోవడం వల్ల పర్యావరణానికి హితం చేకూ ర్చిన వాళ్ళమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.