ఉగ్రవాదంపై ఒక్కటవ్వాలి
- ‘టెర్రర్ ఎకోసిస్టమ్’ను కూల్చేద్దాం
- ద్వంద్వ ప్రమాణాలకు చోటే లేదు
- భద్రతే ఎస్‌సీవో మూలస్తంభం
- చర్చలు, దౌత్యంతోనే యుద్ధాలకు ముగింపు
- ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోదీ పిలుపు
బిష్కెక్, సెప్టెంబర్ 1 (విజయక్రంతి): ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి వచ్చి నిర్ణయాత్మకంగా పోరాడాలని భారత ప్రధా ని నరేంద్ర మోదీ(Indian Prime Minister Narendra Modi) పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని(Terrorism) వ్యూహాత్మక సాధనంగా ఉపయోగించే దేశాలకు, దానికి ఆశ్రయం, మద్దతు ఇచ్చేవారికి అంతర్జాతీయ సమాజం గట్టి సందేశం ఇవ్వాలని కోరారు. ఉగ్రవాదానికి నిధులు, నియామకాలు, తీవ్రవాద భావజాల వ్యాప్తి, సురక్షిత స్థావరాలు.. ఇలా దాని వెనుక ఉన్న మొత్తం ఎకోసిస్టమ్‌ను(Ecosystem) కూల్చివేయాల్సిన అవసరం ఉందన్నారు.
‘ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక ఆస్తి కాకూడదు’ అని పాక్ ప్రధా ని షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే స్పష్టం చే శారు. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలకు తావివ్వరాదని అన్నారు. కిర్గిజ్‌స్తాన్ రాజధాని బిష్కెక్‌లో మంగళవారం జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆతిథ్య దేశ అధ్యక్షుడు సదిర్‌జపరోవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్,
ఇరాన్ అధ్యక్షుడు మసూ ద్ పెజెష్కియాన్, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో, కజకిస్థాన్ అధ్యక్షుడు కాసిమ్‌జోమార్ట్ టోకాయెవ్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, తజికిస్థాన్ అధ్యక్షుడు ఎ మోమాలి రహమాన్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షు డు షవ్కత్ మిర్జియోయెవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవా దం మానవాళికి తీవ్రమైన ముప్పుగా మా రిందని మోదీ పేర్కొన్నారు. ఒక ఘటన జరిగినప్పుడు ప్రతిచర్యగా చర్యలు తీసుకోవడం మాత్రమే సరిపోదని, ఉగ్రవాదానికి ఊతమి చ్చే మొత్తం వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవాలని చెప్పారు. నిధులు, నియామకాలు, రాడి కలైజేషన్, సురక్షిత స్థావరాలపై సమగ్రంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
పశ్చిమాసియా సంక్షోభం.. ప్రపంచంపై ప్రభావం
ప్రస్తుత భద్రతా సవాళ్లు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావడం లేదని మోదీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం దీనికి తాజా ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రాంతీయ ఘర్షణల ప్రభావం ప్రపంచ ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, సరఫరా గొలుసులపై పడుతోందని చెప్పారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలే ఈ ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాయని తెలిపారు. యుద్ధాలకు యుద్ధభూమిలో పరిష్కారం ఉండదని, చర్చలు--దౌత్యం ద్వారానే ఘర్షణలకు ముగింపు పలకాలని భారత్ మొదటి నుంచీ చెబుతోందని పునరుద్ఘాటించారు. వ్యవస్థీకృత నేరాలు, డ్రగ్స్ అక్రమ రవాణా, సమాచార భద్రత వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్‌సీవోలోని సహకార వ్యవస్థలను మరింత సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.
సార్వభౌమత్వాన్ని గౌరవించే అనుసంధానం
ప్రాంతీయ అనుసంధానానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని మోదీ తెలిపారు. రహదారులు, రైల్వేలు, విమాన మార్గాలతో పాటు కస్టమ్స్ ప్రక్రియల సరళీకరణ, డిజిటల్ డాక్యుమెంటేషన్, మెరుగైన లాజిస్టిక్స్ ద్వారా వాణిజ్యాన్ని సులభతరం చేయాలని సూచించారు.
అయితే ప్రతి కనెక్టివిటీ ప్రాజెక్టు సభ్య దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిందే అని స్పష్టం చేశారు. ఇది ఎస్‌సీవో చార్టర్ స్ఫూర్తికి అనుగుణమని చెప్పారు. భద్రత, అనుసంధానం, అవకాశాలే ఎస్‌సీవో భవిష్యత్‌కు మూడు ప్రధాన స్తంభాలని మోదీ పేర్కొన్నారు. భారత్ గతేడాది ప్రతిపాదించిన ‘ఎస్‌సీవో సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం’ తొలి సమావేశాన్ని ఈ ఏడాదే భారత్‌లో నిర్వహిం చనున్నట్లు తెలిపారు.
ఎస్‌సీవోకు 25 ఏళ్లు.. బిష్కెక్ డిక్లరేషన్
ఎస్‌సీవో ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయి న సందర్భంగా బిష్కెక్ డిక్లరేషన్‌ను ఆ మోదించారు. భద్రత, ఆర్థిక సహకారం, రవాణా అనుసంధానం, పర్యావరణం, కృత్రిమ మేధస్సు, మానవతా--సాంస్కతిక రంగాల్లో సహకారానికి సంబంధించిన పలు పత్రాలపైనా సంతకాలు చేశారు.
మొత్తం 28 పత్రాలను ఆమోదించి, సం తకాలు చేసినట్లు కిర్గిజ్ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. 2025లో ఎస్‌సీవో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కిర్గిజ్‌స్తాన్ నుంచి తదుపరి అధ్యక్ష బాధ్యతలు పాకిస్థాన్‌కు బదిలీ అయ్యాయి. వచ్చే ఎస్‌సీ వో ప్లస్ సమావేశాన్ని 2027లో ఇస్లామాబాద్‌లో నిర్వహించనున్నట్లు పాక్ ప్రధాని ప్రకటించారు. సమావేశానికి ముందు ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కాసేపు ముచ్చటించారు.






