వెయ్యి దాటిన నేపాల్ మృతులు
- 4,400 మంది గల్లంతు
- సొరంగంలో 900మంది కార్మికులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- నువాకోట్‌లో కుళ్లిన స్థితిలో 23 మృతదేహాలు
- వ్యాధులు ప్రబలే ప్రమాదం: యూఎన్‌వో హెచ్చరిక
- త్రిభువన్ త్రిశూలి పాఠశాల నిర్మాణానికి భారత్ హామీ
- మళ్లీ వరద హెచ్చరికలతో భయం భయం
ఖాఠ్మాండు, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) : నేపాల్ వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. వరద విధ్వంసానికి మంగళవారం నాటికి వారం రోజులైంది. మృతుల సంఖ్య 1003కి పెరగగా, గల్లంతైన వారి సంఖ్య 4,400గా గ ణాంకాల ద్వారా వెల్లడవుతుంది. మరోమా రు ఏడు జిల్లాలకు వరద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. రసువా, నువాకోట్, ధాడింగ్, గోర్ఖా, తనాహున్, నవల్పరాసి, చి త్వాన్ జిల్లాల్లోని నదుల వెంబడి ఉన్న ప్రాం తాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నా రు.
మరోవైపు త్రిశూలి నది పరివాహక ప్రా ంతంలోని జలవిద్యుత్ ప్రాజెక్టు (Hydroelectric project) సొరంగం లో చిక్కుకున్న 900మంది కార్మికులను రక్షి ంచేందుకు సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తుండగా, బురద భారీగా మేటలు వే యడంతో సొరంగంలోకి వెళ్లేందుకు సహాయక దళాలకు ప్రతిబంధకాలు ఎదురవుతు న్నాయి. సొరంగంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో కార్మికులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు.
ఇప్పటికే బాధితులను రక్షించేందుకు కొండ ప్రాంతంలో చిన్నపాటి పే లుడు జరిపి ఆ ప్రాంతం నుంచి ఆక్సిజన్‌ను పంపింగ్ చేస్తున్నారు. అప్పర్ త్రిశూలి ప్రాజె క్టు (Upper Trishuli Project) నుంచి వారం రోజుల్లో 250 మందిని కా పాడగా, మరో 42 మంది కార్మికుల కోసం గాలింపు కొనసాగుతుంది. మరోవైపు మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లు లేకపోవ డంతో డీఎన్‌ఏ పరీక్షలు చేపట్టిన అనంతరం తాత్కాలిక ఖననాలు చేపడుతున్నారు. ఇటు టిబెట్‌లోనూ 16 మంది మృతి చెందారని, 546 మంది గల్లంతయ్యారని చైనా అధికారికంగా ప్రకటించింది.
నేపాల్ ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన విపత్తు సహాయనిధికి రూ. 363.94 కోట్లు ఆర్థిక సహాయం లభించింది. నువాకోట్‌లోని త్రిభువన్ త్రిశూలి సెకండరీ పాఠశాల నిర్మాణానికి భారత్ సహాయం చేస్తుందని రాయబారి నవీన్ శ్రీవాస్తవ్ ప్రకటించారు. వరద ఉపద్రవం ముంచుకొ స్తుండడంతో దవాడి సమయస్ఫూర్తితో వె య్యిమంది విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. సహాయక చర్యల కోసం ఐక్యరా జ్యసమితి (యూఎన్‌వో) బృందాలు కూడా నేపాల్‌కు చేరుకున్నాయి.
22వేల మంది పిల్ల ల్లో 2,600మందికి చికిత్స అవసరమని, వే లాది మంది గర్భిణులకు పోషకాహార సహా యం అవసమమని ప్రకటించింది. వరదల తో కలరా, మలేరియా, టైఫాయిడ్ వ్యాధు లు సంభవించే ప్రమాదం ఉందని, 19 పాఠశాలలు పూర్తిగా దెబ్బతినగా,
వందమంది పి ల్లల తల్లిదండ్రుల ఆచూకీ లభించడం లేదని పేర్కొంది. నువాకోట్‌లోని ఓ భవనంలో 23 మంది మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. తప్పిపోయిన కు టుంబ సభ్యుల జాడ కోసం వెతుకుతున్న వేలాది మంది ప్రజలతో ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి.






