15-11-2025 12:04:40 AM
ఎంపీ గొడం నగేష్
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్14 (విజయక్రాంతి): దేశ పురోగతి కోసం మహనీ యుల ఆశయాల స్ఫూర్తిగా కలిసి నడుద్దామ ని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గొడం నగేష్ అన్నారు.
శుక్రవారం సర్దార్ వల్లభభా య్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేరా భారత్ ఐక్యత మార్చ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, జిల్లా అధికారులు, యువజన సంఘా ల ప్రతినిధులు, విద్యార్థులతో కలిసి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి సమీకృత కలెక్టరేట్ భవనం నుండి కుమ్రం భీం చౌరస్తా మీదుగా తిరిగి సమీకృత కలెక్టరేట్ భవనం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గొడెం నగేష్ మాట్లాడుతూ దేశ పురోగతి కోసం అందరం కలిసి నడుద్దామని తెలి పారు. వల్లభభాయ్ పటేల్ దేశం కోసం, దేశ ఐక్యత కోసం అహర్నిశలు కృషి చేశారని, స్వాతంత్రోద్యమ పోరాటంలో తన వంతు పాత్ర పోషించి, స్వాతంత్రానంతరం దేశంలోని ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ వల్లభభాయ్ హయాంలో ఏర్పాటు అయిన సంస్థలు నేటికీ కొనసాగుతున్నాయని తెలిపారు.
హరీష్ బా బు మాట్లాడుతూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని నేటి యువత దేశ ఐక్యత, పటిష్టత,అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. అనంతరం అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్య క్రమంలో మేరా భారత్ కార్యక్రమం ఇంచార్జ్, జిల్లా యువ అధికారి శైలి బెల్లాల్, నోడల్ అధికారి రమాదేవి, జిల్లా క్రీడా యువజన శాఖ అధికారి అహ్మద్, జిల్లా అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.